Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింహం, పులి మాంసం.. త్వరలో అందుబాటులోకి, ఎక్కడ, ఎలా అంటే..?

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అనే సామెత ఉంది. అవును ఒక్కొక్కరు ఒకలా.. వెజ్ ఏమో కానీ.. నాన్ వెజ్ ప్రియులు మాత్రం రకరకాల వంటను ఆరగిస్తారు. ఇష్టపడతారు. వారికోసమే ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. అవును వారి కోసం వన్య మృగాల మాంసం వండిపెడతామని చెబుతోంది. మృగాలు అంటే.. వండటం ఏమో కానీ.. వాటిని తింటే కటకటల్లోకి తీసుకెళ్లరా అనే సందేహాం ఉంది. కానీ దానిని ఆ కంపెనీ అన్నీ అనుమతులు తీసుకుంది.

 పులి, సింహాం మాంసం..

పులి, సింహాం మాంసం..

చికెన్, మటన్, ఫోర్క్, ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్.. కొందరు బీఫ్ కూడా తింటారు. అయితే పులి, సింహం లాంటి జంతువుల మాంసం తిని ఉండరు. ఆ వంటకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సింహం, పులి, ఏనుగు, జిరాఫీ మాంసం డిషెస్ ఇప్పుడు నయా ట్రెండ్​ అని స్టార్టప్ కంపెనీ అంటోంది. క్రూర మృగాల మాంసాలతో టేస్టీ వంటలను అందుబాటులోకి తేనుంది. వన్యమృగాల మాంసంతో వంటలు చేయడం నేరం కాదా? అవి తింటే మనుషులకేం కాదా? జైల్లో వేస్తారేమో? అనే భయం కూడా ఉంటుంది. లీగల్‌గా అందుబాటులోకి తెస్తామంటోందీ. ఈ మాంసాలతో తయారు అయిన వంటకాలు త్వరలో జరగబోయే ఓ ఫుడ్​ ఫెస్టివల్​ మెనూలో ఉంటాయట.

మరీ జైలులో వేయరా...?

మరీ జైలులో వేయరా...?


చాలాదేశాల్లో మాంసాల కోసం వన్యమృగాల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. అసలు వాటిని తినాలనే ఆలోచనే రాదు. కానీ లండన్​ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే సంస్థ. సెల్యూలర్ వ్యవసాయంతో ముడిపడిన వ్యాపారం చేసే ఆ సంస్థ.. జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్​లో వన్యమృగాల మాంసాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని అనుకుంది. ల్యాబ్​లో మాంసం అభివృద్ధి కొత్తేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్ చేసి పరిశోధనశాలలో తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి.

ఇక్కడ మాంసం డెవలప్

ఇక్కడ మాంసం డెవలప్


ల్యాబ్​లో అభివృద్ధి చేసే మాంసం విషయంలో మనం ఆ సంప్రదాయ జంతువుల్ని దాటి మరో అడుగు ముందుకెళ్లొచ్చు. మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడుకున్న మాంసాల్ని అభివృద్ధి చేయవచ్చు. ఇలాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఇబ్బందులు లేకుండా మన మెదడు, జీర్ణవ్యవస్థలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశముంది. ఆయా జంతువుల మాంసంలోని ప్రొటీన్, ఎమైనో యాసిడ్​ ప్రొఫైల్​లోని విలక్షణత ఇందుకు కారణం.

 లండన్‌లో టేస్టింగ్

లండన్‌లో టేస్టింగ్


వచ్చే నెలల్లో లండన్​లో టేస్టింగ్ సెషన్​ నిర్వహించాలని భావిస్తోంది. ఈ మాంసాల అభివృద్ధి కోసం జంతువులను ఇబ్బంది పెట్టం. జంతుప్రదర్శనశాలలో ఉన్న ముగజీవుల నుంచి వాటి కణాలను సేకరిస్తామని తెలిపింది. వాటిని ల్యాబ్​లో కల్చరింగ్ చేస్తామని.. ఈ మాంసం గురించి వినేందుకు వింతగా ఉన్నా.. జంతువులను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి.. రుచి చూసేందుకు చాలా మంది ముందుకు వస్తారనే భావిస్తున్నామని ప్రిమేవల్ ఫుడ్స్ కంపెనీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+