పార్లమెంట్ వద్ద దాడి చేసింది బ్రిటన్ వ్యక్తే: ప్రధాని థెరిస్సా

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడి, పోలీసుల చేతిలో హతమైన దుండగుడు బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే వెల్లడించారు. అతడి గురించి వివరాలను ఇంటలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు గురువారం తెలిపారు.

లండన్ దాడి మా పనే: ఇస్లామిక్ స్టేట్ ప్రకటన

దుండగుడు బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తి అని తేలిందని, కొన్నేళ్ల క్రితం అతడిపై హింసాత్మక తీవ్రవాదానికి సంబంధించి విచారణ జరిగిందన్నారు. ఈ కేసు ప్రత్యేకమైనదని, ప్రస్తుతం అతడు ఇంటలిజెన్స్‌ పరిధిలో లేడన్నారు.

London attacker was British-born, known to intelligence services: Theresa May

ముందస్తు దాడిపై ఎలాంటి సూచన గానీ ఆధారం గానీ ఇంటలిజెన్స్‌ వర్గాలకు అందలేదన్నారు. కాగా, నిన్న పార్లమెంట్ వద్ద దాడి జరిగింది. ఆ సమయంలో పార్లమెంటులోనే సభ్యులు ఉన్నారు.

ఈ రోజు పార్లమెంట్‌ తిరిగి సమావేశమైంది. థెరిసా మే పార్లమెంటులో ఉగ్రదాడి గురించి మాట్లాడారు. బ్రిటన్‌ ప్రజలు ఐకమత్యంతో ఉండాలని, తమ దేశం విలువలు ఉగ్రవాదాన్ని ఓడించగలవని నిరూపించాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The man who launched Wednesday's attack at parliament was born in Britain and known to the intelligence services, Prime Minister Theresa May said on Thursday.
Please Wait while comments are loading...