లాస్ ఏంజిలిస్ ఫైర్.. మరింత వైల్డ్

Los Angeles wildfire: ప్రపంచంలోనే మోస్ట్ ఎంటర్‌‌టైన్మెంట్ సిటీగా పేరున్న లాస్ ఏంజిలిస్ మంటల బారిన పడింది. దావానలం ఈ నగరాన్ని దహించివేస్తోంది. ఇప్పటివరకు 24 మంది సజీవదహనం అయ్యారు. మంటలు ఇంకా వ్యాప్తి చెందుతోండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వారం రోజులుగా మంటలు చెలరేగుతూనే ఉంటోన్నాయక్కడ. కిందటి మంగళవారం నాడు ఈ మంటలు అంటుకోగా.. మళ్లీ మంగళవారానికీ లాస్ ఏంజిలిస్ మండుతూనే ఉంది. అగ్నికీలలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఏడో రోజూ మంటల్లో తగుబడుతూనే వస్తోందా సిటీ.

Los Angeles wildfire 2025 death toll has risen to 24

ఇప్పటివరకు 48,500 హెక్టార్ల మేర అడవులు అగ్నికి దహించుకుపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అటు వాతావరణంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. అమెరికా సగటు 1.5 రెండు డిగ్రీల మేర పెరిగిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీగా ఆస్తినష్టం సంభవించిందిక్కడ. అనేక ప్రాంతాలు బుగ్గిపాలు అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. హాలీవుడ్‌ ఇప్పటికే అగ్నికి అహూతి అయింది. పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల నివాసాలు బూడిదకుప్పలయయాయి. యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలు చేపట్టింది. లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది.

లాస్ ఏంజిలిస్ చుట్టూ దట్టమైన అడవులు ఉన్న విషయం తెలిసిందే. ఏంజిలిస్ నేషనల్ ఫారెస్ట్, మౌంటో ఆంటోనియో, శాంటా మోనికా మౌంటెయిన్స్ నేషనల్ పార్క్, పాయింట్ ముగు స్టేట్ పార్క్, మలీబు, పసిఫిక్ పాలిసేడ్స్.. వంటివన్నీ అటవీ ప్రాంతాలే. వేల హెక్టార్లల్లో విస్తరించి ఉందీ అటవీ ప్రాంతం మొత్తం కూడా.

పసిఫిక్ పాలిసేడ్స్‌లో తొలుత దావానలం చెలరేగింది. 23,000 మందికి పైగా నివాసం ఉండే ప్రాంతం ఇది. మంటలు చెలరేగిన తరువాత ఈ ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. పాలిసేడ్స్ అటవీ ప్రాంతానికి ఆనుకునే ఉన్న లాస్ ఏంజిలిస్‌లోని పలు జనావాసాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి.

లాస్ ఏంజిలిస్, ఆరెంజ్, వెంచురా, శాన్‌డియాగో, శాన్ బెర్నార్డినొల్లో భారీ అపార్ట్‌మెంట్లు సైతం మంటల బారిన పడ్డాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వేలాదిమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+