ఎండ.. బ్రిటన్‌లో ఎయిర్ పోర్టు రన్ వేకు తప్పని ఇబ్బందులు.. రాకపోకలు బ్యాన్
ఇండియాలో శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో చల్లని వాతావరణం నెలకొంది. కానీ బ్రిటన్‌లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం టెంపరేచర్ పెరిగింది. దీంతో ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల రన్ వే చెడిపోతుంది. అందుకే విమానాలను డీలే చేస్తున్నారు. లేదంటే మళ్లిస్తున్నారు.

సోమవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమ లేదంటే మంగళవారం రోజున అదీ 38.7 డిగ్రీలకు చేరనుంది. అంతేకాదు యూరప్ అంతటా హీట్ వేవ్ నెలకొంది. దీంతో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పునరుద్దరణ పనులను ఇంజినీర్లు చేస్తున్నారు. త్వరలో తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తామని అధికారులు ట్వీట్ చేశారు.
ఎయిర్ పోర్టు నార్త్ ఆఫ్ సెంట్రల్ లండన్‌కు 35 మైళ్ల దూరంలో ఉంది. ఈజీ జెట్, విజ్ ఎయిర్, ర్యానయిర్, టీడబ్య్లుజే కు చెందిన విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ల్యుటన్ ఇలా ఉంటే మిగతా కూడా అలాంటి పరిస్థితి.. దీంతో 14 విమానాలు ల్యుటన్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ పరిస్థితి సహకరించకపోవడంతో స్టాన్ స్టెడ్ సహా ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఈజీ జెట్, టీయూఐ, విజ్ ద్వారా నిర్వహిస్తోన్న 60 కన్నా విమానశ్రయం వద్ద ఆలస్యం అవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ల్యూటన్ రాక, బోర్డు కూడా ఉంది.












Click it and Unblock the Notifications