పాశ్చాత్య సంస్కృతి కోసమే మలాలాకు నోబెల్: పాక్ తాలిబన్

ఇస్లామాబాద్: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న పాకిస్థాన్ బాలల హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసుఫ్‌జాయ్‌పై పాకిస్థాన్ తాలిబన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇస్లాం సమాజానికి వ్యతిరేకంగా పని చేసే సైనికురాలిగా తయారైందని ఆరోపించారు.

బాలికల విద్యా హక్కు కోసం పోరాటం చేస్తున్న మలాలాపై 2012, అక్టోబర్‌లో తాలిబన్లు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆ సంఘటనతో మలాలా గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. బ్రిటన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన మలాలా, ఆమె తల్లిదండ్రులతోపాటు అక్కడే నివాసముంటూ విద్యనభ్యసిస్తోంది. తాలిబన్ల బెదిరింపుల కారణంగా వారు పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే పరిస్థితులు లేకుండాపోయాయి.

Malala won Nobel prize for

తాలిబన్ల దాడికి ఏమాత్రం భయపడకుండా ఇప్పటికీ ఆమె బాలికల విద్యా కోసం పోరాటం సాగిస్తోంది. ఆమె సేవలను గుర్తింపుగా గత బుధవారం ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అతి పిన్నవయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేగాక పాకిస్థాన్ నుంచి ఈ బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.

కాగా, నోబెల్ మహుమతి ఇచ్చింది విద్య కోసం కాదని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడానికేనని పాకిస్థాన్ తాలిబన్లు పేర్కొన్నారు. మలాలా పాశ్చాత్య ఏజెంట్ అని ఆరోపించారు. పాకిస్థాన్ తాలిబన్ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఉమర్ ఖోరసాని మాట్లాడుతూ.. మలాలాకు నోబెల్ బహుముతి వచ్చింది విద్య కోసం కాదని.. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించేందుకేనని అన్నారు.

మలాలాకు నోబెల్ బహుమతి రావడం పట్ల ఆమె తండ్రి, ఉపాధ్యాయుడు జియావుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు. తన కూతురు కలలు నెరవేర్చాడానికి తాను ఎప్పుడూ సహకరిస్తానని చెప్పారు. కాగా, పాకిస్థాన్ సంస్కృతిని నాశనం చేసేందుకే మలాలా, ఆమె తండ్రి పాశ్చాత్య దేశాలతో కలిసి పని చేస్తున్నారని తాలిబన్ నేత ఖోరసాని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+