షాక్: పొట్టి గౌనుతో వస్తే కింది నుంచి ఫొటోలు తీస్తున్నాడు(వీడియో)
మాస్కో: కామాతురానాం న భయం న లజ్జ అన్నట్లే వ్యవహారించాడో వృద్ధ కామాంధుడు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఏ మాత్రం జంకు లేకుండా సిగ్గుమాలిన పనులు చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఓ
షాపింగ్ మాల్‌లో అక్కడికి స్కర్టుల్లో వచ్చిన అమ్మాయిలు, మహిళల కింద నుంచి ఫొటోలు తీసి వికృతానందం పొందాడు.
ఈ ఘటన రష్యాలోని చెల్యబిన్స్క్ నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఆ కామాంధుడైన వృద్ధుడు సూపర్ మార్కెట్‌లో వస్తువులను చూస్తున్నట్లు నటిస్తుంటాడు. ఆ తర్వాత అతని పక్కనుంచి వెళ్ళే అమ్మాయి అప్‌స్కర్ట్‌లో సెల్‌ఫోన్ పెట్టి చిత్రీకరిస్తుంటాడు.
ఓ అమ్మాయి సెల్‌ఫోన్ కెమెరా శబ్ధం వినిపించడంతో ఆ వృద్ధుడివైపు అనుమానంగా చూసినా, మళ్ళీ షాపింగ్‌లో నిమగ్నమైపోయింది. కాగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆ వృద్ధుడి వికారపు చేష్టలను గమనించాడు.
ఎలాగైనా అతడికి మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను స్థానిక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు సదరు కామాంధుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు.












Click it and Unblock the Notifications