ఫ్లైట్‌లో ప్యాసింజర్ మృతి.. పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లకు దిమ్మదిరిగింది..
మెక్సికో : అతనో డ్రగ్ డీలర్.. మెక్సికో నుంచి జపాన్‌కు డ్రగ్స్ తరలిస్తుంటాడు. ఇప్పటికే చాలాసార్లు ఆ పని చేశాడు. కానీ ఈసారి అదృష్టం కలిసిరాలేదు. డబ్బు కోసం అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు.
జపాన్‌కు చెందిన ఉడో ఎన్ శుక్రవారం ఎప్పటిలాగే బొగోటో నుంచి టోక్యోకు బయలుదేరాడు. మెక్సోకోలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే బొగోటో నుంచి మెక్సికోకు విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఫిట్స్ రావడంతో విమాన సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అయినా ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంతో సోనోరాలోని హెర్మోసిల్లోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. అధికారులు అందుకు అంగీకరించడంతో విమానాన్ని అక్కడ దింపారు. అనారోగ్యం పాలైన ఉడో ఎన్‌ను పరిశీలించిన డాక్టర్లు.. అతను అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.

ఉడో ఎన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు అతని కడుపులో ఉన్న పదార్థం చూసి ఆశ్చర్యపోయారు. అతని పొట్టతో పాటు పేగుల్లో 2.5సెంటీమీటర్ల పొడవున్న 246 ప్యాకెట్లలో కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్ తరలించే క్రమంలో ఆ ప్యాకెట్లలో కొన్ని చిరిగిపోయినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మెదడు వాపుతో అతను మరణించినట్లు రిపోర్టులో స్పష్టమైంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications