కత్తితో పీఎస్‌కు వ్యక్తి: ఆ అధికారి ఏం చేశాడంటే.. (వీడియో)
ప్రమాదకరమైన వ్యక్తి ఎవరైనా పోలీస్ స్టేషన్‌లోకి మారణాయుధంతో వస్తే పోలీసులు ఏం చేస్తారు?అతని చితకబాదడమో అవసరమయితే కాల్చడమో చేస్తారు.
థాయ్‌లాండ్: ప్రమాదకరమైన వ్యక్తి ఎవరైనా పోలీస్ స్టేషన్‌లోకి మారణాయుధంతో వస్తే పోలీసులు ఏం చేస్తారు? అతని చితకబాదడమో అవసరమయితే కాల్చడమో చేస్తారు.
కానీ థాయ్‌లాండ్‌లో ఓ పోలీస్ అధికారి మాత్రం.. పోలీస్ స్టేషన్‌లోకి కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తి... తన చేతిలోని ఆయుధాన్ని కిందపడేయడమే కాకుండా, సిగ్గుపడేలా చేశాడు.
అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తిని ఓ అద్భుతం చేసి తిరిగి మనిషిగా మార్చాడు. దీంతో తన బాధను అర్థం చేసుకున్న పోలీసులను గట్టిగా హత్తుకొని ఏడ్చాడు ఆ వ్యక్తి.
ఇది మొత్తం అక్కడి సిసిటివి ఫుటేజీలో రికార్డయింది. దాని ప్రకారం.. ఓ వ్యక్తి పొడవాటి కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డాడు. పలువురిని బెదిరించాడు.
దీంతో వణికిపోయిన పోలీసులు కొంతమంది అతనిని కాల్చే ప్రయత్నం చేశారు. అయితే అనిరుత్ మాలి అనే ఆఫీసర్ మాత్రం కాల్చవద్దని పోలీసులను ఆపాడు.
అతడిని మాటలతోనే సముదాయించాడు. నీవు నాకు తెలుసునని అదే వ్యక్తితో చెప్పాడు. నిన్ను ఏం చేయమని, కత్తిని పక్కన పడేసి రమ్మని కోరాడు.
ఆ పోలీస్ ఆఫీసర్ మాటలు నమ్మిన వచ్చిన వ్యక్తి కత్తిని ఆయనకు ఇస్తుండగా.. ఆ అధికారి అతనిని హత్తుకొని ఓదార్చాడు. దీంతో ఆ వచ్చిన వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు.












Click it and Unblock the Notifications