పొట్ట నిండా 80 కండోమ్స్.. పదేళ్ల జైలుశిక్ష, 20 లక్షల జరిమానా..!

దుబాయి : దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కంగుతిన్నారు. ఓ వ్యక్తి కడుపు నిండా 80 కండోమ్స్ బయటపడటంతో అవాక్కయ్యారు. తీరా చూస్తే అందులో డ్రగ్స్ నింపినట్లు వెల్లడైంది. ఈజిప్టుకు బయలుదేరేందుకు ఓ 49 ఏళ్ల వ్యక్తి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్నాడు. అయితే అతడి కదలికలపై అనుమానం రావడంతో అక్కడి అధికారులు నిలువెత్తు స్కానింగ్ చేశారు. దాంతో కడుపులో ఏదో దాచినట్లు అనుమానం కలిగింది. నిలదీస్తే అలాంటిదేమీ లేదని బుకాయించాడు.

Man held for carrying drugs in 80 condoms hidden in stomach

సదరు వ్యక్తి ఏదో దాస్తున్నాడని భావించి డాక్టర్ల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. అతడి కడుపులో 80 కండోమ్స్ చూసి షాక్ తిన్నారు. అయితే వాటి నిండా దాదాపు 2 కిలోల 300 గ్రాముల కొకైన్ నింపినట్లు నిందితుడు అంగీకరించాడు. దాంతో పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దీనార్లు అంటే దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత దుబాయ్ నుంచి బహిష్కరించాలని తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+