బిల్లు చూసి షాక్.. రూ.2 వేలతో ఎక్స్ రే మిషన్ తయారీ.. ఎక్కడంటే..
పేషంట్లు దొరికారు అనుకొ.. ఆస్పత్రులు వదలడం లేదు. ముక్కు పిండీ మరీ వసూల్ చేస్తాయి. ఇందులో సందేహానికి తావులేదు. అవును కరోనా సమయంలో హాస్పిటల్ మేనెజ్‌మెంట్ దారుణంగా బీహెవ్ చేశాయి. అవును జాలి, దయ లేకుండా ప్రవర్తించాయి. డబ్బుల విషయంలో అసలు రాజీ పడలేదు. అయితే ఓ యూట్యూబర్‌కు దవాఖాన పట్టపగలే చుక్కలు చూపించింది. అవును రెండురోజులకే మోపెడు అంతా బిల్ వేసింది.

అనారోగ్యంతో..
యూ ట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. రెండురోజలు తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సిన సమయం.. అయితే వర్గాలు అయితే బిల్లు చూసి గుండె గుభేల్ మంది. 69,000 డాలర్ల బిల్లు ఇచ్చారు. మన కరెన్సీలో దాదాపు రూ. 52.63 లక్షలు బిల్లు వేశారు. రెండు రోజల పాటు తీసిన ఎక్స్ రేలు,తనకు ఇచ్చిన యాంటిబయాటిక్స్ కు అంత అయిందని ఆస్పత్రి వర్గాలు తాపీగా చెప్పాయి.

బిల్ చూసి మైండ్ బ్లాంక్
ఆ బిల్ చూసి విల్ ఉస్మాన్ దిమ్మతిరిగింది. ఎక్స్ రేకు ఇంత ఖర్చవుతుందా? అని ఆలోచించాడు. ఆ ఖర్చులో ఎక్స్ రే యూనిట్ తయారు చేస్తానని శపథం చేశాడు. అనుకున్నట్టు ఎక్స్ రే తీశాడు. యూ ట్యూబ్‌లో చూసి ఎక్స్ రే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అతనికి ఇన్సూరెన్స్ ఉండటంతో సరిపోయింది. లేదంటే బిల్లు వాచేది. ఇన్సూరెన్స్ పోగా 2,500 డాలర్లు చెల్లించి ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

రూ.2 వేలతో ఎక్స్ రే మిషన్
ఇంటికి వచ్చాడో లేదో.. ఎక్స్ రే మిషన్ మీదే ధ్యాస పెట్టాడు. అందుకోసం యూ ట్యూబ్‌లో సర్చ్ చేశాడు. యూ ట్యూబ్ చూసి ఎక్స్ రే మిషన్ తయారు చేశాడు. రూ. 2000 ఖర్చుతో ఎక్స్ రే మిషన్ తయారు చేశాడు. మిషన్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. తన బిల్ వల్లే తాను మిషన్ తయారు చేసేందుకు దోహదం చేసిందని చెప్పాడు. అతని సృజనను నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వావ్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications