షాట్ గన్ శుభ్రం చేస్తుంటే బాలుడి బలి

రోమ్: న్యూ యార్క్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. షాట్ గన్ లో నుంచి ఓ బుల్లెట్ దూసుకు వెళ్లి చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిర్లక్షంగా గన్ చేతపట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

రోమ్ లోని డొమినిక్ స్ట్రీట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో హెన్రీ బార్టల్ (18) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే అపార్ట్ మెంట్ లో హెన్రీ బార్డల్ గర్ల్ ఫ్రెండ్ సెలెనా హిట్, ఆమె ఏడు నెలల కుమారుడు నాథానియెల్ ఉంటున్నారు.

రెండు రోజుల క్రితం లివింగ్ రూంలో హెన్రీ కుర్చుని ఉన్నాడు. లోపలి గదిలో సెలెనా కుమారుడిని దగ్గర పెట్టుకుని వేరే వ్యక్తితో మాట్లాడుతున్నది. అదే సమయంలో హెన్రీ షాట్ గన్ శుభ్రం చేశాడు. తరువాత బుల్లెట్లు లోడ్ చేశాడు.

 Man who was cleaning gun fatally shot infant in New York

అనంతరం షాట్ గన్ తీసుకుని ఒడిలో పెట్టుకున్నాడు. ఆ సమయంలో తుపాకీ ఒక్క సారిగా పేలిపోయింది. గురి బాలుడి వైపు ఉండటంతో బుల్లెట్ దూసుకు వెళ్లింది. బుల్లెట్ బాలుడు నాథానియెల్ తలలో దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. శిశు హత్య చట్టం కింద అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే షాట్ గన్ ఆకస్మికంగా పేలిందని బాలుడి తల్లి అంటున్నదని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+