ప్రపంచ సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ అరుదైన ఘనత.. టాప్ 10లో వీరే!!

బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెస్లా , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ టాప్ లో నిలిచారు. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ప్రపంచ సంపన్నుడిగా ఆయన ప్రధమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సంవత్సరం రెండో స్థానంలో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ నిలిచారు.

ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ లో మస్క్
2024 బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ 256 బిలియన్ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ 2 లో ఉన్న మెటా సిఈవో మార్క్ జుకర్ బర్గ్ 206 బిలియన్ల డాలర్ల నికర సంపదతో నిలిచారు.

Mark Zuckerberg has a rare record in world richest list by bloomberg index here are top 10 billionires

అరుదైన ఘనత సాధించిన మార్క్ జుకర్ బర్గ్
జెఫ్ బెజోస్ ను దాటి తొలిసారిగా ఆయన ద్వితీయ స్థానం సంపాదించుకుని అరుదైన ఘనత సాధించారు. ఇక మూడవ స్థానంలో జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన 205 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. ఇక ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగవ స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్ 193 బిలియన్ డాలర్ల నికర సంపదతో నిలిచారు. ఆ తరువాత ఐదవ స్థానంలో లారీ ఎల్లిసన్ 179 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు.

ఆరు నుండి పది స్థానాల్లో ఉన్న ప్రపంచ సంపన్నులు వీరే
బిల్ గేట్స్ 161 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ స్థానంలో నిలువగా, లారీ పేజ్ 150 బిలియన్ డాలర్ల సంపదతో ఏడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు . స్టీవ్ బాల్మెర్ 145 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదవ స్థానంలో నిలువగా, వారెన్ బఫెట్ 143 మిలియన్ డాలర్ల సంపదతో 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక పదవ స్థానంలో సెర్గీ బ్రిన్ 141 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు.

ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ స్థానాలు ఇవే
వీరంతా బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రకటించిన టాప్ టెన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు. ఇక బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లో భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ 14వ స్థానంలో నిలిచారు. ఆయన 107 బిలియన్ డాలర్ల సంపదతో 14 స్థానం దక్కించుకున్నారు. 100 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదాని 17వ స్థానంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+