Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూతురిపై జుకర్ 3లక్షలకోట్ల ప్రేమ:వీరూ దానమిచ్చారు

వాషింగ్టన్: కూతురు పుట్టిన సంతోషంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రూ.3 లక్షల కోట్ల విరాళం ప్రకటించారు. కంపెనీలో తమ 99 శాతం షేర్లను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది అందర్నీ అచ్చెరువొందేలా చేసింది.

తన కుమార్తె పెరిగే ప్రపంచం అందమైన మంచిగా ఉండాలని కలలు గన్న జుకర్ బర్గ్... అలాంటి ప్రపంచాన్ని సాకారం చేసేందుకు తన సంపదనంతా ధారబోశారు. రేపటి తరం కోసం ఇది తన నైతిక భాధ్యత అని వినమ్రంగా చెపుకొన్నారు. తద్వారా జుకర్‌బర్గ్‌ తన చిన్నారిని మన ప్రపంచంలోకి అరుదైన రీతిలో స్వాగతించారు.

తమ కుమార్తె మ్యాక్సిమా, ఇతర చిన్నారులకోసం ఈ ప్రపంచాన్ని మెరుగైన భూతలంగా తీర్చిదిద్దేందుకు తమ జీవితకాలంలో ఈ విరాళాన్ని ఇవ్వనున్నట్లు జుకర్‌బర్గ్‌, ఆయన భార్య ప్రిసిలా చాన్ ప్రకటించారు. చిన్నారి మ్యాక్స్‌ను ఉద్దేశిస్తూ... ఫేస్‌బుక్‌ పుటలో ఓ లేఖను పోస్ట్‌ చేశారు.

Mark Zuckerberg Vows to Donate 99% of His Facebook Shares for Charity

'మా కుమార్తె మ్యాక్స్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతించడం మాకెంతో సంతోషంగా ఉంది. గర్భం దాల్చినప్పటి నుంచీ మీ ప్రేమ, మద్దతు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా చిన్న కుటుంబంలో ఎంతో సంతోషం నిండిపోయింద'ని ఆ పోస్ట్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

ఇంకా ఆ లేఖలో.. 'వ్యాధులకు చికిత్స, కేంద్రిత అభ్యసనం, హరిత విద్యుత్తు ఉత్పత్తి, ప్రజల అనుసంధానత, బలమైన సామాజిక బృందాల నిర్మాణం, పేదరికం తగ్గించడం, సమాన హక్కులు కల్పించడం, దేశాల మధ్య అవగాహన వ్యాప్తి ద్వారా మానవ సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, సమానత్వాన్ని ప్రోత్సహించే ప్రపంచం కోసం అలాంటి ప్రపంచంలో మా పాప ఎదగాలని ఆశిస్తున్నామ'ని పేర్కొన్నారు.

ఈ ప్రపంచాన్ని చిన్నారులందరి కోసం తీర్చిదిద్దేందుకు మావంతు చిన్నపాటి సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, రేపటి తరం కోసం ఈ ప్రపంచాన్ని మెరుగుపరచడంలో ఇతరులతో చేతులు కలిపేందుకు ఫేస్‌బుక్‌లోని మా 99 శాతం షేర్లను జీవితకాలంలో అందజేస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం అత్యంత ప్రభావం చూపే వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్‌ ఒకటి. 2004లో తన కళాశాల రూమ్మేట్‌లు, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి హార్వర్డ్‌ డార్మిటరీ గదుల నుంచి చిన్నస్థాయిలో ఫేస్‌బుక్‌ను జుకర్ బర్గ్ ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని ఇతర విద్యా ప్రాంగణాలకు పరిచయం చేశారు.

ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి అంచెలంచెలుగా పాకిపోయింది. కొంతకాలంలోనే ప్రపంచం మొత్తం చుట్టేసింది. ఆ విజయంతో జుకర్‌బర్గ్‌ 23 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడయ్యారు. 2012లో ఫేస్‌బుక్‌ వినియోగదారులు వంద కోట్లకు చేరారు. 2010లో ప్రఖ్యాత టైమ్‌ 100 మంది కుబేరులు, ప్రభావిత వ్యక్తుల జాబితాలో చేరారు.

ఫేస్‌బుక్‌ ప్రస్థానంపై ఓ హాలీవుడ్‌ సినిమా వచ్చింది. జుకర్‌బర్గ్‌ 1984లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆర్డ్‌స్లే హైస్కూల్‌లో చదువుకున్నారు. మాధ్యమిక పాఠశాలలో ఉన్నప్పుడే జుకర్‌బర్గ్‌ కంప్యూటర్లను ఉపయోగించడం, సాఫ్ట్‌వేర్లను రూపొందించడం ప్రారంభించారు.

1990లోనే తండ్రి అతనికి బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ బోధించారు. తర్వాత ప్రత్యేకంగా ఓ బోధకుడినీ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే జుకర్‌బర్గ్‌ బాలమేధావిగా పేరు సంపాదించారు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు ముఖ్యంగా సమాచార ఉపకరణాలు, గేమ్‌లను రూపొందించాన్ని ఆస్వాదించేవారు. వియత్నాం శరణార్థి కుటుంబానికి చెందిన తన సహచర విద్యార్థి చాన్‌ను 2012లో వివాహమాడారు.

జుకర్ బర్గ్ లాగే చాలామంది భూరి విరాళాలు ప్రకటించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య, వ్యవసాయం, పేదరికం, ఆరోగ్యం తదితరాల కోసం గేట్స్ 27 మిలియన్ డారల్లు ఇచ్చారు.

సాయం చేయాలనే బిల్ గేట్స్ పిలుపుతో వారెన్ బఫెట్ కూడా ముందుకు వచ్చారు. అతను 21.5 మిలియన్ డాలర్లను విద్య, ఆరోగ్యం, పేదరికంపై ఖర్చు పెడుతున్నారు. సులెమన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ రాజీ... విద్య, ఆరోగ్యం, సామాజిక సేవల కోసం 5.7 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. కార్లోస్ స్లిమ్.. ఇంటర్నెట్, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం 27.3 బిలియన్ డాలర్లు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+