Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందంలో అరబిక్ సంచలనం.. మిస్ యూనివర్స్‌కు దుబాయ్ బ్యూటీ!

Miss Universe UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చరిత్రలో తొలిసారిగా ఒక ఎమిరాటీ అమ్మాయి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనబోతోంది. మిస్ యూనివర్స్ 2025 పోటీలో యూఏఈ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె అందం, అసాధారణ నేపథ్యం, సామాజిక లక్ష్యాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చారిత్రక ఘనతను సాధించిన బ్యూటీ క్వీన్ పేరు మర్యం మహమ్మద్. 26 ఏళ్ల మర్యం మహమ్మద్ మిస్ యూనివర్స్ యూఏఈ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో వచ్చే నెలలో థాయిలాండ్‌లో జరగబోయే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టే మొట్టమొదటి ఎమిరాటీ మహిళగా ఆమె నిలవనున్నారు.

మర్యం మహమ్మద్ నేపథ్యం
మర్యం మహమ్మద్ కేవలం అందానికే కాదు, ఆమె వ్యక్తిగత అభిరుచులు, విద్యా నేపథ్యం కారణంగా కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నారు.ఎమిరాటీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, మర్యంకు ఫాల్కన్ వేట (డేగతో వేటాడటం), ఒంటె సవారీ వంటి సంప్రదాయ కార్యకలాపాలు అంటే చాలా ఇష్టం. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఉన్నత విద్య కోసం ESMOD దుబాయ్లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు అభ్యసిస్తున్నారు. ఫ్యాషన్ విద్యార్థిని అయినప్పటికీ వందలాది మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ఎంపిక, శిక్షణ ప్రక్రియ తర్వాత ఆమె ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌కు ఎంపికయ్యారు.

Maryam Mohammed First Emirati to Compete in Miss Universe 2025 A Historic Beauty Icon

సాధికారత దిశగా సామాజిక లక్ష్యం
మిస్ యూనివర్స్ వేదికను తన సామాజిక లక్ష్యాల కోసం ఉపయోగించుకోవాలని మర్యం మహమ్మద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. "పెద్ద కలలు కనే విశ్వాసాన్ని యూఏఈ నాకు ఇచ్చింది. నేను ఆశయాలు గల, ఆసక్తిగల, ప్రేరణ పొందిన మహిళల గొంతుకగా నిలబడాలని కోరుకుంటున్నాను," అని ఆమె తెలిపారు. మర్యం మహమ్మద్ ప్రధాన లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించడం, మహిళలను సాధికారత దిశగా నడిపించడం.. ప్రేమ, శాంతి ఉన్న సమాజాలను ప్రోత్సహించడం. మర్యం 'రమదాన్ అమన్', 'ది గివింగ్ ఫ్యామిలీ ఇనిషియేటివ్' వంటి అనేక దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాక అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల కార్యక్రమాలలో యూఏఈకి ప్రాతినిధ్యం వహించి, దేశ ప్రతిష్ఠను పెంచారు.

కొత్త తరానికి ఆదర్శం
మిస్ యూనివర్స్ 2025 పోటీకి సిద్ధమవుతున్న మర్యం మహమ్మద్.. తన విజయం ద్వారా కొత్త తరం ఎమిరాటీ మహిళలకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నారు. యూఏఈ సాధికారత, సుస్థిరత, ఆవిష్కరణల కథను ప్రపంచ ప్రేక్షకులకు తెలియజేయడానికి ఆమె పూర్తి కట్టుబడి ఉన్నారు. మర్యం విజయం దేశంలో మహిళా సాధికారతకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+