తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు..
తైవాన్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని సెంట్రల్ వెదర్ బ్యూరో వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం నార్త్ ఈస్ట్ తీర ప్రాంతం అయిన ఇలాన్ లో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఇలాన్ కౌంటీ హాల్ కు తూర్పున 32.3 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్టు సెంట్రల్ వెదర్ బ్యూరో పేర్కొంది. అలాగే భూకంపం ధాటికి ఐలాండ్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
తైవాన్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. మూడు రోజుల క్రితం ఆగ్నేయ తీరప్రాంత కౌంటీ అయిన టైటుంగ్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తైవాన్ లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైనట్లు సెంట్రల్ వెదర్ బ్యూరో వెల్లడించింది. ఈ మేరకు తైవాన్ కు చెందిన ఫైర్ ఏజెన్సీ ఎక్స్ వేదికగా సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భూకంప తీవ్రత ఉన్న ప్రాంతంలోని ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే స్థానికులు ప్రమాదకరమైన వస్తువుల దగ్గర ఉండకూడదని.. షూస్, టార్చ్ బెడ్స్ దగ్గరే పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఇక తైవాన్ ద్వీపం సిస్మిక్ జోన్ ప్రాంతంలో ఉంది. టెక్టోనిక్ ప్లేట్స్ వల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. 2016 లో దక్షిణ తైవాన్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపంలో 100 మందికి పైగా మృతి చెందారు. అంతకుముందు 1999 లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే మూడు రోజుల క్రితం కూడా తైవాన్ లో భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది.












Click it and Unblock the Notifications