ఫ్రాన్స్‌లో కార్చిచ్చు భీభత్సం.. 13వేల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి !

దక్షిణ ఫ్రాన్స్‌ లోని ఆడ్ డిపార్ట్‌మెంట్‌ (Aude department) ప్రాంతంలో భారీ కార్చిచ్చు (Wildfire) సంభవించింది. ఈ భీభత్సానికి ఇప్పటి వరకు దాదాపు 13,000 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కాలిపోయాయని చెబుతున్నారు. కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం భారీగా పొగ వ్యాపించినట్టు తెలుస్తోంది. దాదాపు 1,800 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైమానిక దళాలు సైతం వారికి సహాయం అందిస్తున్నట్టు సమాచారం.

ఎక్కడ మొదలైంది అంటే..

ఇక ఈ కార్చిచ్చు మంగళవారం మధ్యాహ్నం రిబౌట్ అనే గ్రామం వద్ద మొదలైనట్టు భావిస్తున్నారు. బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా మంటలు వేగంగా విస్తరించాయని అంటున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఒక వృద్ధురాలు తన ఇంట్లో నుంచి బయటకు రాలేక మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడగా.. అందులో ఏడుగురు పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అంతే కాకుండా సమీపంలోని 25 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.

massive-wildfire-at-southern-france-and-13-000-hectares-of-trees-burned

సహాయక చర్యలు..

ఈ విపత్తును ఎదుర్కొనడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వాటర్ బాంబర్ విమానాలు, హెలికాప్టర్ల సహాయంతో అగ్నిని నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు మంటల వ్యాప్తికి అనుకూలంగా ఉండటంతో.. సమీపంలోని కొన్ని గ్రామాలను సైతం ఖాళీ చేయిస్తున్నారు. చుట్టుపక్కల రహదారులు మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు.

ఈ అనూహ్య పరిస్థితుల్లో ప్రజలు బయటకి వెళ్లకూడదని.. అవసరమైతే మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+