లేడీ పాప్ సింగర్‌ను 20సార్లు కత్తితో పొడిచాడు
టోక్యో: జపాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జపనీస్ పాప్ స్టార్ మయు టొమిటాపై ఓ అభిమాని కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రగాయాలపాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం టోక్యోలోని కొగనీ సిటీలో ఈ దారుణ చోటు చేసుకుంది.
ఘటనపై నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కొగనీ సిటీలో టొమిటా ప్రదర్శన ఇవ్వాల్సి ఉండటంతో ఆమె అక్కడకు చేరుకుంది. కాగా, ఆమెపై ఒక్కసారిగా టొమొహిరో ల్వజకి(27) అనే ఓ అభిమాని కత్తితో దాడి చేశాడు. 20సార్లు విచక్షణారహితంగా పొడిచాడు.

కాగా, టొమిటా ఇంతకుముందే టొమొహిరోపై టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. టొమొహిరో సోషల్ మీడియాలో టొమిటాకు సంబంధించి అసభ్యకరమ మెసేజ్‌లు పంపేవాడని పోలీసులు తెలిపారు. తాను ఇచ్చిన వాచ్ తీసుకోని కారణంగానే ఆమెపై నిందితుడు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
ఇది ఇలా ఉండగా, గతంలోనూ జపాన్‌లో పాప్ సింగర్లపై దాడులు జరిగాయి. గత సంవత్సరం జపాన్‌లో పాపులర్ అయిన జే-పాప్ గ్రూప్ ఏకేబీ48కు చెందిన ఇద్దరు సభ్యులతోపాటు మరో వ్యక్తిపై దాడి జరిగింది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష పడింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications