‘‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా .. మానసికంగా సిద్ధమయ్యా.. కానీ...’’

Posted By:
Subscribe to Oneindia Telugu

పారిస్: పారిస్ దోపిడీ ఘటన తరువాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలు తనను రేప్ చేసి చంపేస్తారని తాను భావించానని చెప్పింది.

గత ఏడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కిమ్ తన సోదరీమణులతో పంచుకుంది.

'Mentally Prepped' For Rape, Death During Paris Robbery

''అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలోకి బుల్లెట్లు దించుతారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేసి చంపేస్తారనుకున్నా. అందుకు మానసికంగా సిద్ధమయ్యా..'' అని కిమ్ కర్దాషియన్ వెల్లడించింది.

అయితే ఆ దోపిడీ దుండగులు ఆమెకు భౌతికంగా ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆమెను బాత్రూంలో బంధించి, ఆమె ఆభరణాలను మాత్రమే ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kim Kardashian West recounted the night she was robbed at gunpoint in her Paris apartment during last year's Paris Fashion Week on Sunday's Keeping Up With the Kardashians. The episode focused on before and after the incident, including footage of Kanye West abruptly ending his Governors Ball performance after hearing the news.
Please Wait while comments are loading...