మనిషా? మృగమా?: మాజీ భార్యను చంపి.. ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి...
ఓ వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చడమే కాదు.. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అంతటితో ఊరుకోకుండా శరీరం సగ భాగాన్ని కుక్కర్‌లో ఉడికించాడు. మిగిలిన భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి.. పరారయ్యాడు.
మెక్సికో: ఓ వ్యక్తి తాను మనిషిననే విషయాన్నే మరిచిపోయి.. క్రూరమృగంలా.. కర్కశత్వంగా తన మాజీ భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. హతమార్చడమే కాదు.. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు.
అంతటితో ఊరుకున్నాడా.. లేదు.. ఆమె శరీరం సగ భాగాన్ని కుక్కర్‌లో ఉడికించాడు. మిగిలిన భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచేలా, భయానకంగా ఉన్న ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.

అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మగ్డలీనా(28), సెసర్ లోపేజ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య పొసగకపోవడంతో కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వేరువేరుగానే ఉంటున్నారు.
పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తండ్రి లోపేజ్ వద్దకు వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే కొద్దిరోజుల కిందట మగ్ధలీనా పిల్లలు తమ తండ్రి వద్దకు వెళ్లారు. దీంతో వారిని తీసుకువచ్చేందుకు జనవరి 13న మగ్డలీనా తాను ఉండే టాక్స్ కో నగరం నుంచి తన మాజీ భర్త సెసర్ లోపేజ్ నివాసానికి వెళ్లింది.
అలా వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోపేజ్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ వారికి భయానక దృశ్యం కనిపించింది.
మగ్డలీనా శరీరం ముక్కలు ముక్కలుగా చేయబడి.. కొంత భాగం ఫ్రిజ్‌లో పెట్టి కనిపించింది. మరికొంత శరీర భాగం ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి ఉంది. ఈ ఘాతుకానికి ఆమె మాజీ భర్తే పాల్పడినట్లు పోలీసులకు అర్థమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న లోపేజ్ కోసం వారు గాలిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications