మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి

మిఖాయిల్ గోర్బచెవ్

ప్రచ్ఛన్న యుద్ధానికి శాంతియుత ముగింపు పలికిన సోవియెట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచెవ్ మంగళవారం మృతి చెందారు. ఆయనకు 91 ఏళ్ళు.

గోర్బచెవ్ 1985లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎస్‌ఎస్‌ఆర్) అధికార పగ్గాలను చేపట్టారు. ప్రపంచానికి సోవియట్‌ యూనియన్ ద్వారాలు తెరియారు. దేశంలో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టారు.

కానీ, సోవియెట్ యూనియన్ పతనాన్ని మాత్రం ఆపలేకపోయారు. సోవియెట్ పతనం తర్వాత రష్యా ఏర్పడింది.

మిఖాయిల్ గోర్బచెవ్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

"చరిత్ర గమనాన్ని మార్చారు" అని యూఎన్ అధినేత ఆంటోనియో గూటియెరెజ్ అన్నారు.

గోర్బచెవ్ మృతికి నివాళులు సమర్పిస్తూ, "గోర్బచెవ్ విలక్షణమైన రాజకీయ నాయకుడు" అని ట్వీట్ చేశారు.

గోర్బచెవ్, రోనాల్డ్ రీగన్

"ప్రపంచం అంతర్జాతీయ నాయకుడిని, శాంతి స్థాపనకు అలుపెరగని ప్రచారకుడు, విభిన్న దేశాలను ఒకే తాటి పై నడిపించగలిగే నాయకుడిని కోల్పోయింది."

ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ఆయన తరచుగా ఆస్పత్రి పాలవుతున్నారు.

జూన్‌లో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచురించింది. అయితే, ప్రస్తుతం ఆయన మరణానికి కారణాన్ని మాత్రం వెల్లడి చేయలేదు.

గోర్బచెవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేసినట్లు పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోప్ రష్యన్ వార్తా సంస్థ ఇంటర్ ఫ్యాక్స్ కు తెలిపినట్లు రాయిటర్స్‌కు తెలిపింది.

"స్వేచ్చాయుత యూరప్‌కు దారి తెరిచిన నమ్మశక్యమైన, గౌరవప్రదమైన నాయకుడు" అని అంటూ యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా ఒన్‌డెర్ లేయెన్ అన్నారు.

"గోర్బచెవ్ మిగిల్చిన వారసత్వాన్ని ఎవరూ మర్చిపోరు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+