భారత్‌కు దురదృష్టం: మిస్ యూనివర్స్ 2024 కిరీటం దక్కిందెవరికంటే?: తొలిదేశంగా చరిత్ర

Miss Universe 2024: ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2024 కిరీటం డెన్మార్క్‌కు దక్కించుకుంది. ఆ దేశానికి చెందిన విక్టోరియా గ్జెర్ థెల్విగ్ ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. ఈ టైటిల్‌ను సాధించడం డెన్మార్క్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైనల్ రౌండ్‌కు భారత్ అర్హత సాధించలేకపోయింది. టాప్ 12లో నిలువలేకపోయింది.

మిస్ యూనివర్స్ సిరీస్‌లో ఇది 73వ టైటిల్. మెక్సికో సిటీలోని ఎరీనా సీడీఎంఎక్స్‌లో ఫైనల్స్ రౌండ్ పోటీలు జరిగాయి. ఈ టైటిల్ మొత్తం భారత్ సహా 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. ఫైనల్స్‌కు 12 మంది ఎంపికయ్యారు. భారత్ తరఫున పోటీ చేసిన రియా సింఘా విఫలం అయ్యారు. ఫైనల్స్ రౌండ్‌కు చేరలేకపోయారు.

Miss Universe 2024 Denmark s Victoria Kjaer Theilvig first Danish contestant ever to win the pageant

విక్టోరియా క్జెర్ థెల్విగ్ వయస్సు 20 సంవత్సరాలు. 2004లో డెన్మార్క్ గ్రిబ్స్‌కోవ్‌ సమీపంలోని సొబొర్గ్‌లో జన్మించారు. ఉన్నత విద్య కోసం కోపెన్‌హెగెన్‌కు షిఫ్ట్ అయ్యారు. లింగ్బై హెండెల్స్‌జిమ్నాసియం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్నారు. బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

ఆ తరువాత న్యాయశాస్త్రాన్ని చదివారు. డాన్స్‌లో ప్రావీణ్యతను సాధించారు. ప్రొఫెషనల్ డాన్సర్‌గా, డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా స్థిరపడ్డారు. యానిమల్ లవర్‌గా గుర్తింపు పొందారు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కడంలో ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. డాన్స్‌ గురించి జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో ఈ టైటిల్‌ను సాధించగలిగారు.

2021 మిస్ డెన్మార్క్ టైటిల్ కోసం పోటీపడ్డారామె. 32 మంది పోటీ పడ్డ ఆ కంటెస్ట్‌లో రెండో రన్నరప్‌గా నిలిచారు. ఆ మరుసటి సంవత్సరంలో మిస్ గ్రాండ్ డెన్మార్క్‌గా అపాయింట్ అయ్యారు. ఇండోనేషియాలో నిర్వహించిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్స్‌లో పోటీ పడ్డారు. టాప్ 20లో నిలిచారు.

కాగా- ఈ మిస్ యూనివర్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన రియా సింఘా నిరాశపరిచారు. టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇప్పటివరకు భారత్ తరఫున ఈ కిరీటాన్ని దక్కించుకుంది సుస్మిత సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+