బిగ్ షాక్.. మిస్ వరల్డ్ ఆత్మహత్య.. కారణం ఏంటంటే ?
పుదుచ్చేరికి చెందిన మోడల్, మిస్ వరల్డ్ టైటిల్ విజేత శాన్ రేచల్ అలియాస్ శంకర ప్రియ ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు 25 ఏళ్లు మాత్రమే. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె తన నివాసంలో అధిక మోతాదులో రక్తపోటు, నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దీంతో చిన్న వయస్సు లోనే చేజేతులా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచి వేస్తుంది.
కాగా రేచల్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జిప్మర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినట్టు సమాచారం. అందుకే ఈ రకంగా చేసి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

శాన్ రేచల్ చిన్నతనంలోనే క్యాన్సర్‌తో తల్లిని కోల్పోయారు. నల్లగా ఉన్న తన చర్మరంగు కారణంగా ఎన్నో అవమానాలు, వివక్షలు ఎదుర్కొన్నారు. కానీ వాటిని తట్టుకొని కూడా మోడలింగ్ రంగంలో రాణించారు. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. అలానే 2020-21లో మిస్ పాండిచ్చేరి టైటిల్‌ను దక్కించుకున్నారు. బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్ కూడా అందుకున్నారు.
సామాజిక వివక్షను తట్టుకొని, స్ఫూర్తిదాయకంగా ఎదిగిన శాన్ రేచల్.. జీవితం విషాదాంతం కావడం పట్ల ఆమె సన్నిహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుకు సైతం ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications