వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 22 మంది ప్రయాణికులు.. నలుగురు భారతీయులు

|
Google Oneindia TeluguNews

నేపాల్‌లో ఓ విమానం కూలిపోయింది. అదీ 43 ఏళ్ల పాటు సేవలు అందించిన ప్రైవేట్ ఎయిర్ లైన్.. ఆదివారం 22 మంది ప్రయాణికులతో మొదలైంది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ముస్తాంగ్ జిల్లాలో గల కొవాంగ్‌లో పడిపోయింది. దాని అడ్రస్ చివరకు కనుగొగలిగారు.

తారా ఎయిర్ విమానం మనపతి హిమాల్ కొండచరియ కొంద గల లాంచే నది వద్ద కూలిపోయిందని స్థానికులు నేపాల్ ఆర్మీకి సమాచారం అందజేశారు. భూ, వాయు మార్గం ద్వారా ఆర్మీ సంఘటనా స్థలం వద్దకు చేరుకోనుంది. ఉదయం 9.55 గంటలకు విమానం బయల్దేరగా.. ఉదయం 10.07 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. వెంటనే నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. 10 మంది సైనికులు.. ఇద్దరు అధికారులతో బయల్దేరింది.

Missing flight with 22 onboard found in Nepals Mustang district

నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తారా ఎయిర్ కు చెందిన ఈ విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు. విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సంఘటన స్థలానికి బయల్దేరింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
plane operated by a private airline in Nepal that went missing on Sunday with 22 people on board was found at Kowang in Mustang
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X