కోమాలో ఉన్న ఖమేనీ- ఒక కాలు కూడా తొలగింపు: ది సన్ సంచలన కథనం

ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఒక కాలును తొలగించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బ్రిటిష్ వార్తాపత్రిక 'ది సన్' తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత విశ్వసనీయ వర్గాలను తన కథనంలో ఉటంకించింది.

ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్‌ ఇంటెన్సివ్ కేర్‌లో యూనిట్ లో కోమాలో ఉన్నారని ది సన్ పేర్కొంది. ఇరాన్ ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి మొహమ్మద్ రెజా జాఫర్‌గందీ పర్యవేక్షణలో డాక్టర్లు చికిత్స చేస్తోన్నట్లు వివరించింది. ఇరాన్ ప్రముఖ సర్జన్‌లలో ఒకరు రెజా జాఫర్. హాస్పిటల్ భవనంలోని ఒక భాగాన్ని భారీ భద్రత మధ్య సీల్ చేశారని కూడా ఆ కథనం వెల్లడించింది.

Mojtaba Khamenei Reportedly Injured Amid Middle East Conflict Officials Say Iran s Leader Is Safe

ఈ పరిణామాల మధ్య రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ రహస్యంగా మొజ్తబా ఖమేనీని కలిసినట్లు కూడా నివేదించింది. సినా హాస్పిటల్‌ ఐసీయూలో కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉందని సమాచారం. మొజ్తబాకు ఒక కాలు పూర్తిగా తొలగించారు. కడుపు, కాలేయానికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన ఫిబ్రవరి 28 నాటి దాడిలో మొజ్తబా గాయపడ్డారా అనేది మాత్రం స్పష్టంగా లేదు.

ఇరాన్ ప్రభుత్వ టీవీ యాంకర్లు మొజ్తబా ఖమేనీని 'రంజాన్ యుద్ధ యోధుడిగా, గాయపడిన సైనికుడిగా అభివర్ణిస్తోండటం కూడా తమ కథనానికి మరింత బలాన్ని ఇచ్చినట్టయిందిని ది సన్ పేర్కొంది. "ఖమేనీ ఒకటి లేదా రెండు కాళ్లను తొలగించి ఉండొచ్చు. ఆయన కాలేయం లేదా కడుపు కూడా దెబ్బతింది. బహుశా ఆయన కోమాలో ఉండవచ్చు.." అని అభిప్రాయపడింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తున్న అంశాలు లేకపోలేదు.

ఫిబ్రవరి 28 నాటి అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నుండి మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత మార్చి 8న మొజ్తబా సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగిస్తారని ఇరాన్ మీడియా మొదట ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు. సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయిదు రోజుల తర్వాత, ఆయన తొలి సందేశం టీవీలో ఓ యాంకర్ చదివి వినిపించారే తప్ప మొజ్తబా కెమెరా ముందు కనిపించలేదు. ఈ పరిణామాలు, ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలకు, పుకార్లకు, అనేక వాదనలకు దారితీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+