మంకీపాక్స్: 75 దేశాలు, 16 వేల కేసులు...గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఆ మేరకు హై అలర్ట్ జారీ చేసింది. ఇకపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులపై దృష్టి పెడుతుంది.
ఈ వైరస్‌పై చర్చించేందుకు రెండోసారి సమావేశమైన డబ్ల్యూహెచ్ఓ ఎమెర్జెన్సీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 75 దేశాల నుంచి 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా అయిదు మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
మంకీపాక్స్‌కు ముందు ఈ కేటగిరీలో రెండు హెల్త్ ఎమరజెన్సీలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ మహమ్మారి కాగా, రెండవది పోలియో. దీని నిర్మూలనకు నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.
మూడవది మంకీపాక్స్. గతంలో సమావేశమైనప్పుడు, మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా వర్గీకరించాలా వద్దా అనే దానిపై అత్యవసర కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే విషయంగా గుర్తిచినట్టు ఆయన తెలిపారు.
ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోందో స్పష్టంగా తెలియడం లేదని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.
"డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా యూరప్ మినహా అన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉంది. యూరప్ ప్రాంతంలో మంకీపాక్స్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది" అని టెడ్రోస్ వివరించారు.
అంతర్జాతీయంగా ప్రయాణికుల రాకపోకలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ వైరస్ మరింత విజృంభించే ప్రమాదం కనిపిస్తోందని ఆయన అన్నారు.
ఈ వైరస్‌ను అత్యవసర పరిస్థితిగా వర్గీకరించడం వలన వ్యాక్సీన్ల అభివృద్ధి వేగవంతం కాగలదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు కూడా పెరుగుతాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు.
మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి, ఎక్కువ రిస్క్ ఉన్నవారిని కాపాడడానికి డబ్ల్యూహెచ్ఓ కొన్ని నిబంధనలను కూడా జారీ చేసింది.
"సరైన కమ్యూనిటీలలో సరైన వ్యూహాలు పాటిస్తే ఈ వైరస్ వ్యాప్తిని ఆపగలం" అని టెడ్రోస్ అన్నారు.
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- Monkeypox: మంకీపాక్స్ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా? ఇది బయోలాజికల్ ఆయుధమా? లాక్డౌన్లు తప్పవా?

మంకీపాక్స్ గురించి బీబీసీ కరస్పాండెంట్ జేమ్స్ గళ్లఘర్ అందిస్తున్న నివేదిక
మంకీపాక్స్ లక్షణాలేంటి, దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉందా, లేదా మొదలైన విషయాలను జేమ్స్ గళ్లఘర్ వివరించారు.
"మంకీపాక్స్‌ను తొలుత 1950లలో మధ్య ఆఫ్రికాలో గుర్తించారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 2,000 కంటే ఎక్కువ కేసులను ధృవీకరించారు.
గే, బైసెక్సువల్ పురుషులు, హెల్త్‌కేర్ వర్కర్లు సహా మంకీపాక్స్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి వెంటనే వ్యాక్సీన్ అందజేయాలని ఆరోగ్య అధికారులు ఇప్పటికే సిఫార్సు చేస్తున్నారు.
ఈ వైరస్ సోకితే అధిక జ్వరం, గవద బిళ్లల వాపు, శరీరంపై బొబ్బర్లు, దద్దుర్లు, నోటిలో, జననాంగాలపై పొక్కులు రావచ్చు. సాధారణంగా ఈ ఇంఫెక్షన్ తక్కువగానే ఉంటుంది.
మంకీపాక్స్‌ను అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా గుర్తించడం సరైన చర్య.
ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని దేశాలకు హెచ్చరించినట్టయింది. అలాగే, దీని గురించి అవగాహన పెంచుకుని, అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ వైరస్‌ను నిలువరించడానికి మన దగ్గర సాధనాలు ఉన్నాయి. ఇది కోవిడ్ అంత సులువుగా వ్యాపించదు. దీనికి ఇప్పటికే వ్యాక్సీన్ ఉంది. స్మాల్‌పాక్స్ వ్యాక్సీన్ ఇవ్వచ్చు. మంకీపాక్స్ నుంచి రక్షించుకునేందుకు ఇది బాగా పనిచేస్తుంది.
మంకీపాక్స్ ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది. కానీ గే, బైసెక్సువల్ పురుషులు, స్వలింగ సంపర్కులైన పురుషులకు ఎక్కువగా వ్యాపిస్తుందని చెబుతున్నారు.
ఈ సమాచారంతో ఆయా సమూహాలను లక్ష్యాలుగా చేసుకుని, తగిన చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
అయితే, కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టపరంగా నేరం. అటువంటప్పుడు ఈ సమూహాల పట్ల ఆంక్షలు, వేధింపులు అవరోధంగా నిలుస్తాయి.
మంకీపాక్స్‌ను అరికట్టడం అనేది సాంఘికంగా, సాంస్కృతికంగా కూడా సవాలు" అని గళ్లఘర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'ఇస్లాం పవిత్ర నగరం’ మక్కాలో ప్రవేశించి వీడియో తీసిన ముస్లిమేతర జర్నలిస్ట్.. ఈయన ఎవరు? ఎందుకు వెళ్లారు?
- అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?
- ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. 'అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’
- కృత్రిమ మేథకు మనిషిలాగే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పిన ఇంజనీర్‌ను గూగుల్ ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించింది?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications