అమెరికా ముందు పెను సవాల్: ఎమర్జెన్సీ విధింపు: గే, బైసెక్సువల్స్‌తో

వాషింగ్టన్: అమెరికా మరో పెను సవాల్‌ను ఎదుర్కొంటోంది. రెండున్నర సంవత్సరాలుగా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడిన అమెరికా ఇంకో విపత్తు ముంగిట్లో నిలిచింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చుట్టుముట్టాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతోన్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి.

48 రాష్ట్రాల్లో..

48 రాష్ట్రాల్లో..

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం 6,600లకు పైగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48 రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. రాజధాని వాషింగ్టన్ డీసీ, అమెరికా పరిపాలనలో ఉన్న ప్యూర్టోరికో మినహా.. అన్ని రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ వెల్లడించింది.

వాస్తవ లెక్కలు..

వాస్తవ లెక్కలు..

అధికారిక లెక్కల కంటే వాస్తవ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. పరిస్థితులు చేయిదాటిపోతోండటంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి గ్జేవియర్ బెసెర్రా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితిని విధించడం వల్ల ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి అవసరమైన వనరులను సమీకరించుకోవడానికి వీలవుతుందని అన్నారు.

మంకీపాక్స్ నో డెత్స్..

మంకీపాక్స్ నో డెత్స్..

ఇప్పటివరకు అమెరికాలో మంకీపాక్స్ వల్ల మరణాలు సంభవించలేదు. ఇదివరకు వైరస్ బారిన పడిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది దీని బారిన పడి మరణించారు. భారత్‌లో తొలి మరణం కేరళలో నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి కిందికి మారడంతో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని గ్జేవియర్ బెసెర్రా చెప్పారు.

గే, బైసెక్సువల్స్..

గే, బైసెక్సువల్స్..

మంకీపాక్స్ అత్యధిక పాజిటివ్ కేసులు న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్‌లల్లో నమోదయ్యాయి. ఇదివరకే న్యూయార్క్, ఇల్లినాయిస్, కాలిఫోర్నియాల్లో స్టేట్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది స్థానిక ప్రభుత్వం. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ తలెత్తడం జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ విధించినట్లు మంత్రి తెలిపారు. గే, బైసెక్సువల్ వల్ల అత్యధికంగా ఈ కేసులు వ్యాప్తి చెందుతున్నాయని స్పష్టం చేశారు.

కోవిడ్‌తో కల్లోలం..

కోవిడ్‌తో కల్లోలం..


రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్‌తో పోరాడుతోంది అమెరికా. కరోనా వైరస్ వల్ల పెద్ద ఎత్తున ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. అత్యధిక పాజిటివ్ కేసులు, అదే స్థాయిలో మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 10,57,811 మంది అక్కడ మరణించారు. 9,37,39,666 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో భారత్ నిలిచింది. భారత్‌లో కోవిడ్ మరణాలు 5,26,530గా రికార్డయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+