Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆకాశంలో ట్రయాంగిల్: ఎలా చూడొచ్చంటే..

ఆకాశంలో మరో అద్భుతం చోటు చేసుకుంటోంది. చంద్రుడితో పాటు శుక్ర, గురుగ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయి. కనువిందు చేస్తోన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మూడూ మరింత చేరువగా కనిపిస్తాయి.

వాషింగ్టన్: ఆకాశంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. చంద్రుడితో కలిసి శుక్రుడు-గురు గ్రహాలు ట్రయాంగిల్ గా ఏర్పడ్డాయి. సూర్యాస్తమయం తరువాత చంద్రుడికి రెండు వైపులా గురు, శుక్రగ్రహాలు కనిపిస్తాయి. బైనాక్యులర్లు, స్పేస్ టెలిస్కోప్ వంటివి అవసరం లేకుండా నేరుగా స్పేస్ ట్రయాంగిల్ ను మనం చూడొచ్చు. వచ్చేనెల మొదటి వారం వరకూ చంద్రుడు-శుక్రుడు-బృహస్పతి అత్యంత సమీపంలో సంచరిస్తూ కనువిందు చేస్తాయి.

మార్చి 1న..

మార్చి 1వ తేదీన ఈ మూడు గ్రహాలు సంయోగం చెందనున్నాయి. సూర్యుడు అస్తమించిన తరువాత శుక్రుడు, బృహస్పతి గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి. timeanddate.com వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 1వ తేదీన రాత్రి 8:38 నిమిషాలకు గురుగ్రహం, రాత్రి 8:40 నిమిషాలకు శుక్రగ్రహం అస్తమిస్తాయి.

తరచూ సంభవించే కంజంక్షన్..

తరచూ సంభవించే కంజంక్షన్..

గ్రహాల సంయోగం లేదా ప్లానెటరీ కంజంక్షన్ అనేది తరచూ సంభవిస్తుంటుది. ఒకటి, అంతకుమించిన గ్రహాలు, చంద్రుడికి అత్యంత సమీపానికి చేరుకోవడాన్ని ప్లానెటరీ కంజంక్షన్ గా పిలుస్తారు. మార్చి 1వ తేదీన సంభవించే శుక్ర- గురుగ్రహాల కంజంక్షన్ సమయంలో ఈ రెండింటినీ 32 ఆర్క్‌మినిట్‌ వేరు చేస్తుంది. ఒక ఆర్క్‌మినిట్ ఒక డిగ్రీలో 1/60కి సమానంగా చెబుతారు సైంటిస్టులు.

గెలీలియన్ మూన్..

గెలీలియన్ మూన్..

శుక్రగ్రహానికి చెందిన గిబ్బస్ ఫేస్ తో పాటు గురుగ్రహం చుట్టూ తిరుగే నాలుగు గెలీలియన్ చంద్రులలో మూడింటిని మనం స్పేస్ టెలిస్కోప్ ల ద్వారా వీక్షించడానికి అవకాశం ఉంది. సూర్యుడికి శుక్రగ్రహం దూరంగా వచ్చే దశను గిబ్బన్ ఫేస్ అంటారు. బృహస్పతి చుట్టూ పరిభ్రమించే నాలుగు అతిపెద్ద చంద్రులను గెలీలియన్ మూన్ గా పిలుస్తారు. టెలిస్కోప్ ద్వారా గురుగ్రహంపై క్లౌడ్ బ్యాండ్‌లను గుర్తించే వీలుంది.

 భూమితో సమాన సాంద్రత..

భూమితో సమాన సాంద్రత..

కంజంక్షన్ సమయంలో- గురుగ్రహం మైనస్ 2.1, శుక్రుడు మైనస్ 4.0 మాగ్నిట్యూడ్స్ వద్ద అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు కూడా అత్యంత ప్రకాశవంతమైనవి. భూమికి సమానమైన పరిమాణం, సాంద్రత కలిగిన గ్రహం వీనస్. అత్యంత నెమ్మదిగా తనచుట్టూ తాను పరిభ్రమిస్తుంటుంది. భూ సాపేక్షత సిద్ధాంతానికి పోలి ఉంటుంది.

అతిపెద్ద గ్రహం..

అతిపెద్ద గ్రహం..

శుక్రగ్రహంపై అలముకున్న మేఘాలు సూర్య కిరణాలను పరావర్తనం చేయగలవు. ఫలితంగా సూర్యరశ్మి వాటి మీద పడినప్పుడు అది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. బృహస్పతి దాని పరిమాణం కారణంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సౌర వ్యవస్థలోనే అతిపెద్ద గ్రహం జుపిటర్. భూమి కంటే 11 రెట్లు వెడల్పుగా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+