అమెరికాలో మహమ్మద్ అలీ కుమారుడి నిర్బంధం.. రెండుగంటలపాటు ఇంటరాగేషన్
బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీ కుమారుడు మహమ్మద్ అలీ జూనియర్ కు కూడా ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధం తప్పలేదు. ఆయన్ని దాదాపు 2 గంటలపాటు వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు.
లూయిస్ విల్: అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాల బాధితుల చిట్టా రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీ కుమారుడు కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఈ నెల ఆరంభంలో ఆయన్ని ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో దాదాపు 2 గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించినట్లు, ఈ సందర్భంగా ఆయన ఏ మతానికి చెందిన వాడని గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 7న మహమ్మద్ అలీ జూనియర్ తన తల్లి కైల్హా కామ్ చో అలీతో కలిపి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డల్-హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. పేర్లలో అరబిక్ పదాలు ఉండడంతో వీరిని అధికారులు పక్కకు లాగేశారు. వీరు జమైకాలో బ్లాక్ హిస్టరీ మంత్ ఈవెంట్ లో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వారి కుటుంబ అడ్వకేట్ క్రిస్ పేర్కొన్నారు.

అలీ జూనియర్ తల్లిని అధికారులు వెంటనే విడిచిపెట్టినప్పటికీ, అలీని మాత్రం రెండు గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 'మీరు ముస్లిమా? మీ పేరులో ఆ పదం ఎలా వచ్చింది?' వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి అలీ జూనియర్ అవుననే సమాధానం ఇచ్చారని వారి అడ్వకేట్ తెలిపారు.
రెండు గంటల తర్వాత అలీని అధికారులు విడుదల చేశారని, దీనిపై అలీ జూనియర్ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. తమ లాగే ఎంతో మందిని అమెరికా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. ''ఈ ఘటనకు నేరుగా డొనాల్డ్ ట్రంపే బాధ్యుడు. ఆయన ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది..'' అని అలీ కుటుంబం వ్యాఖ్యానించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications