ఆ తల్లికి కొడుకు కన్నా.. కారే ఎక్కువైంది(వీడియో)

బీజింగ్: ఏ తల్లి అయినా తన కన్న సంతానం కన్నా ఏదీ ఎక్కువగా భావించరు. అయితే ఓ చైనా తల్లి మాత్రం తనకు తన కొడుకు ప్రాణాల కన్నా ఖరీదైన బిఎండబ్ల్యూ కారే ఎక్కువగా భావించింది.

కారు డోర్లు లాకవడంతో కారులోనే ఉండి తీవ్రంగా విలపిస్తున్న కన్న కొడుకు ఆర్థనాథాలను పట్టించుకోకుండా.. తన కారు అద్దాలను మాత్రం పగలగొట్టొద్దని కాపాడేందుకు వచ్చిన వారికి చెప్పింది. దీంతో అక్కడి వారు ఆమెపై వైఖరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆ తల్లి నిరాకరించినా.. కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీసి రక్షించారు.

వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల బాలుడు ఆడుకుంటున్న బిఎండబ్ల్యూ కారులో చిక్కుకుపోయాడు. కారు తలుపులు తెరుచుకోకపోవడంతో గుక్కపెట్టి ఏడ్చాడు. అక్కడే ఉన్న బాలుడి తల్లి కారు అద్దాలు పగలగొట్టేందుకు ఒప్పుకోలేదు. కారు తాళాలు తయారు చేసే వ్యక్తికోసం వేచి చూసిందే తప్పా అద్దాలు పగలగొట్టేందుకు ససేమిరా అంది.

అక్కడేవున్నవారు బాలుడి ఆక్రందనతో చలించిపోయి ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె మనసు కరగలేదు. బాలుడి పరిస్థితి చూసి ఆమెను అగ్నిమాపక సిబ్బంది సైతం బతిమాలినా నిర్ణయం మార్చుకోలేదు.

చివరకు చేసేదేమి లేక అగ్నిమాపక సిబ్బంది బలవంతంగా కారు అద్దాలు పగలగొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొడుకు ప్రాణాల కంటే కారుకే విలువిచ్చిన ఆ మహాతల్లిని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+