NASA : చంద్రయానానికి నాసా మరో ప్రయత్నం-రాత్రికి అంతరిక్షానికి ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్..
చంద్రుడి మీదకు అడుగుపెట్టి చూపించాలన్న తాపత్రయంతో మరో భారీ ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా సిద్ధమైంది. ఇంజిన్ సమస్యల కారణంగా ఈ ప్రయోగంపై వెనక్కి తగ్గిన నాసా.. శనివారం చంద్రునిపై తన తొలి ప్రయాణంలో తన స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS)ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. భవిష్యత్తులో మనుషులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాకెట్ దాని మొదటి ప్రయాణంలో ఓరియన్ అంతరిక్ష నౌకతో ప్రయోగించబోతున్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39B నుంచి ఈ వ్యోమనౌక బయలుదేరనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. తాజాగా ఆగస్టు 29న నాసా ఇదే ప్రయోగం చేపట్టాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇంజన్ సమస్యలతో ఈ ప్రయోగం కాస్తా వాయిదా పడింది.అయితే అప్పుడు తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడంతో పాటు మరింత మెరుగ్గా అప్ డేట్ చేసి దీన్నిప్రయోగానికి సిద్ధం చేసినట్లు నాసా వర్గాలు వెల్లడించాయి.

గత వారం ఈ ప్రయోగం రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ శనివారం ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. యూఎస్ స్పేస్ ఫోర్స్ స్పేస్ లాంచ్ డెల్టా 45తో వాతావరణ శాస్త్రవేత్తలు 60% అనుకూలమైన వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు.
శనివారం ఈ ప్రయోగానికి వాతావరణ పరిస్ధితులు అనుకూలంగా ఉన్నట్లు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై మానవజీవితానికి అనుకూలంగా పరిస్దితులు ఉన్నాయా లేదా అన్నది తేలితే ఆ తర్వాత మరిన్ని ప్రయోగాలు చేయొచ్చని నాసా కూడా ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications