వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: వైట్‌హౌస్ జాబ్‌కు ముస్లీం మహిళ గుడ్‌బై, ఏం చెప్పిందంటే..

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీరు శ్వేతసౌధం ఉద్యోగులకు కూడా నచ్చని పరిస్థితి కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీరు శ్వేతసౌధం ఉద్యోగులకు కూడా నచ్చని పరిస్థితి కనిపిస్తోంది. ముస్లీం దేశాల పైన ట్రంప్ నిషేధం విధించిన ఎనిమిది రోజులకు వైట్ హౌస్‌లో పని చేసే ఓ ముస్లీం మహిళ రాజీనామా చేసింది.

వైట్ హౌస్‌లోపని చేసే ఓ మహిళ ట్రంప్‌ వైఖరికి నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్న రుమానా అహ్మద్‌ అనే మహిళను 2011లో వైట్‌హౌస్‌లో, నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో పని చేయటానికి ఎంపిక చేశారు.

<strong>పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్</strong>పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్

కానీ ట్రంప్‌ ముస్లిం దేశాలపై నిషేధం విధించిన ఎనిమిదో రోజే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె ది అట్లాంటిక్ అనే పత్రికకు తన అభిప్రాయాలను రాశారు.

National security staffer quit after 8 days in Trump White House

తాను తన అత్యున్నత విధానాల రక్షణకు కృషి చేస్తానని, తాను హజీబ్‌ను ధరించే మహిళను అని, తాను ఈ బృందంలో హజీబ్‌ ధరించే ఏకైక మహిళను అని, నాటి బరాక్ ఒబమా కార్యవర్గం తనను వారిలో కలుపుకొని పోయారని చెప్పారు.

ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారని, కానీ నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఉండేందుకు ప్రయత్నించానని, కానీ ట్రంప్‌ నిషేధం విధించాక కూడా ఎనిమిది రోజులు విధులు నిర్వహించానని చెప్పారు.

<strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి</strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి

చివరిరోజు సాయంత్రం తాను ఉద్యోగాన్ని వీడుతున్నానని ట్రంప్‌ సీనియర్‌ నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌ మిచెల్‌ ఆంటోన్‌కు సమాచారం అందించానని, ఆయన తొలుత ఆశ్చర్యపోయారని, తర్వాత ప్రభుత్వం నుంచే వైదొలగుతున్నావా అని అడిగారని, అంతేకానీ ఎందుకు అని మాత్రం అడగలేదన్నారు.

తాను అవమానభారంతో తమ దేశంలోని చారిత్రక భవనం నుంచి నిష్క్రమించానని, నేను ఓ అమెరికన్‌గా.. ఒక ముస్లింగా ఉంటానని చెప్పింది. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో పట్టభద్రురాలైన అహ్మద్‌ ఒబామాను స్ఫూర్తిగా తీసుకొని వైట్‌హౌస్‌లో ఉద్యోగంలో చేరారు. కాగా, ఈమె బంగ్లాదేశ్ నుంచి వచ్చారు.

English summary
A White House national security staffer resigned after eight days in the Trump administration. The Maryland woman is a Muslim-American whose family emigrated from Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X