పాకిస్తాన్ తదుపరి ప్రధానిగా నవాజ్ సోదరుడు
పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ కానున్నట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
కరాచీ: పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ కానున్నట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆయన పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఆయన జాతీయ అసెంబ్లీ, పార్లమెంటులో సభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

పనామా గేట్ స్కాంలో కేసులో నవాజ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన సుప్రీం.. షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. దాంతో షరీఫ్ తన ప్రధాన పదవికి రాజీనామా చేశారు. షరీఫ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications