France Protests: నేపాల్ తరహాలో ఫ్రాన్స్.. మాక్రాన్ సర్కార్ కూలుతుందా?
France Protest: నేపాల్ తరహాలోనే ఫ్రాన్స్‌లోనూ భారీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు బస్సులను తగలబెట్టారు. ఈ నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు నిరసనకారులు ఈ ఆందోళనలు చేపట్టారు. కొత్తగా నియమితులైన ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకార్నుకు ఆందోళనకారులు తీవ్ర సవాల్ విసురుతున్నారు.
ఈ హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రెటైలు స్పందించారు. నిరసనలు మొదలైన కొన్ని గంటల్లోనే దాదాపు 200 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రెన్నెస్ అనే పశ్చిమ నగరంలో ఓ బస్సును తగలబెట్టారని.. దేశ నైరుతి ప్రాంతంలో ఓ పవర్ లైన్‌కు నష్టం జరగడంతో రైలు సర్వీసులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. నిరసనకారులు దేశంలో తిరుగుబాటు వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలను అదుపు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80,000 మంది పోలీసులను మోహరించింది. ఈ పోలీసు బలగాలు బారికేడ్లను తొలగించి, నిరసనకారులను త్వరితగతిన అరెస్ట్ చేశాయి.
🚨BREAKING🚨:CHAOS IN FRANCE 🇫🇷
— The_Independent (@TheIndeWire) September 10, 2025
Thousands flood streets in nationwide “Block Everything” protests against government economic policies. Clashes with police erupt, transport disrupted, 80,000 officers deployed as unrest mirrors Yellow Vest tensions. pic.twitter.com/yNoinBpA20

ఫ్రాన్స్ కొత్త ప్రధాని
ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్నును ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఫ్రాన్స్ బడ్జెట్‌పై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడం ఆయనకు అప్పగించిన తక్షణ కర్తవ్యం. 39 ఏళ్ల సెబాస్టియన్ లెకార్ను ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన రక్షణ మంత్రి కావడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 2030 నాటికి సైనిక బలాన్ని పెంచే ప్రణాళికలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చాలా కాలంగా నమ్మకస్థుడిగా ఉన్న లెకార్ను, గత ఏడాది కాలంలో ఫ్రాన్స్‌కు నాల్గవ ప్రధాని. గత సోమవారం లెకార్ను ముందున్న ప్రధాని ఫ్రాంకోయిస్ బేరు, ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం గెలవడంతో ప్రధాని పదవి ఖాళీ అయింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications