వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ విమాన ప్రమాదం: అదుపుతప్పి గాలిలో ఇలా.., వీడియోలు వైరల్

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల ప్యాసింజర్ విమానం కుప్పకూలడంతో అందులోని 68 ప్రయాణికులతోపాటు నలుగురు మృతి చెందారు. అయితే, విమానం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు విమానంకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

ఖాట్మండు వెళ్లే విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే క్రాష్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలిపోయే ముందు క్షణాల ముందు తీసిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nepal plane crash: Flight loses control mid air before it hits the ground.

ఒక వీడియోలో.. విమానం మధ్య గాలిలో బ్యాలెన్స్ కోల్పోయి, పెద్ద శబ్ధంతో నేలకు కూలినట్లు కనిపించింది. మరో క్లిప్‌లో కూలిపోయిన విమానం నుంచి పొగలు రావడంతో భారీ మంటలు కనిపిస్తున్నాయి. అయితే స్థానికులు, సహాయక బృందాలు ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రెస్క్యూ టీమ్‌లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్లిప్‌ను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.

విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. పాత విమానాశ్రయం, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఈ విమానం ​​కూలిపోయిందని యతి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ఖాట్మండు పోస్ట్‌కి తెలిపారు.

విమాన శిథిలాలు మంటల్లో ఉన్నాయని, రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అధికారి గురుదత్తా ధాకల్ తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. విమానంలో ఐదుగురు భారతీయులతో సహా 15 మంది విదేశీ పౌరులు ఉన్నారు. విమానంలోని ప్రయాణికులందరూ మరణించారని నేపాల్ ప్రభుత్వం ధృవీకరించింది.

English summary
Nepal plane crash: Flight loses control mid air before it hits the ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X