ఛార్లెస్ శోభరాజ్‌కు విముక్తి- సీరియల్ బికినీ కిల్లర్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం..!!
ఖాట్మండు: ఛార్లెస్ శోభరాజ్. జనాన్ని గజగజ వణికించిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్. నేర ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ది బికినీ కిల్లర్, ది స్ప్లిట్టింగ్ కిల్లర్, ది సర్పెంట్.. ఇలా ఎన్నో మారుపేర్లతో ఇంటర్‌పోల్‌ను సైతం ముప్పుతిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మై ఔర్ ఛార్లెస్, ది సర్పెంట్ అనే వెబ్ సిరీస్‌లకు అతనే ఇన్‌స్పిరేషన్. అతన్ని నేర చరిత్రను ఆధారంగా చేసుకునే అవి తెరకెక్కాయి. అతని మనస్తత్వాన్ని ప్రతిబింబింపజేశాయి.

కంటి మీద కునుకు లేకుండా..
ఛార్లెస్ శోభరాజ్ తల్లి భారతీయురాలు, తండ్రి వియత్నాం దేశస్తుడు. భారత్ సహా థాయ్‌లాండ్, నేపాల్, మలేసియా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, గ్రీస్.. వంటి దేశాలను వణికించాడు. కంటి మీద కునుకు లేకుండా చేశాడు. హత్యల మీద హత్యలు చేశాడు. అధికారిక లెక్కల ప్రకారం.. ఛార్లెస్ శోభరాజ్ 20 మందిని హత్య చేశాడు. ఈ సంఖ్య 30 వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

స్వేచ్ఛా ప్రపంచంలోకి..
అలాంటి నేరస్తుడు- ఇక స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోన్నాడు. ఒకట్రెండు రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. ప్రస్తుతం ఛార్లెస్ శోభరాజ్ నేపాల్ రాజధాని ఖాట్మండూ సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తోన్నాడు. అతణ్ని వెంటనే విడుదల చేయాలంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అతని వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విడుదలైనప్పటి నుంచి 15 రోజుల్లోగా దేశం నుంచి బహిష్కరించాలని సూచించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం.

78 సంవత్సరాలు..
ఈ మేరకు జస్టిస్ సపన ప్రధాన్ మళ్లా, జస్టిస్ తిల్ ప్రసాద్ శ్రేష్ఠతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఛార్లెస్ శోభరాజ్ వయస్సు 78 సంవత్సరాలు. 2003లో అతనికి జైలుశిక్ష పడింది. 1975లో నేపాల్‌లోకి ప్రవేశించడానికి నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించిన ఛార్లెస్ శోభరాజ్.. అమెరికాకు చెందిన కొన్నీ జో బోరోన్‌జిచ్, అతని గర్ల్‌ఫ్రెండ్ కెనడియన్ లారెంట్ క్యారియర్‌ను హత్య చేశాడు.

వేర్వేరు నేరాల కింద..
ఈ కేసులో భక్తాపూర్ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్షను విధించిందక్కడి కోర్టు. అతను చేసిన వేర్వేరు నేరాలకు వేర్వేరుగా శిక్ష పడింది. అమెరికన్లను హత్య చేసినందుకు 20 సంవత్సరాలు, వివిధ దేశాల్లో వరుస హత్యలకు పాల్పడినందుకు మరో 20 సంవత్సరాలు అతనికి జైలు శిక్ష పడింది. నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించినందుకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింద

దేశ బహిష్కరణ..
ప్రస్తుతం 19 సంవత్సరాల జైలు శిక్షను ఛార్లెస్ శోభరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడతన్ని జైలు నుంచి విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇతర నేరాలపై పడిన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకోవద్దని పేర్కొంది. వెంటనే జైలు నుంచి విడుదల చేయడంతో పాటు 15 రోజుల్లోగా దేశ బహిష్కరణ చేయాలని సూచించింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications