విందుకు పిలిచిన ఇజ్రాయెల్ ప్రధాని, జపాన్ ప్రధానికి షూలో వడ్డించారు
జెరూసలేం: జపాన్ ప్రధాని షింజో ఇటీవల ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు ఆయనకు ఓ షూలో ఆహార పదార్థాలు వడ్డించడం కలకలం రేపింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
మే 2వ తేదీన షింజో అబేను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు విందుకు ఆహ్వానించారు. అబే తన సతీమణితో పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెరిసే షూలో పలు రకాల వంటకాలు, రకరకాల చాక్లెట్లను ఉంచి అబేకు అందించారు.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది జపాన్ ప్రధానిని అవమానించడమేనని ఆ దేశ అధికారులు అంటున్నారు.

దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాన చెఫ్ వివరణ ఇస్తూ.. అది నిజమైన షూ కాదని, ఆ ఆకారంలో పలు పదార్థాలతో దానిని రూపొందించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ కళాకారుడు టామ్ డిక్సన్ దీనిని రూపొందించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications