పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో)

స్పెయిన్: ఒక అసాధారణమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్ని కార్చిచ్చులు ఒక రకంగా ఉంటే.. ఈ మంటలు మాత్రం విచిత్రంగా వ్యాపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్పెయిన్ లోని కలహోర్రాలోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది.

కార్చిచ్చులానే వ్యాపించిన మంటలు ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగాయి. ఆ మంటలు కేవలం గడ్డి మొక్కలను మాత్రమే తగలబెడుతూ మిగితా వాటిని వదిలేయడం గమనార్హం. మంటల మధ్యలోకి వచ్చిన కొన్ని చెక్క బెంచీలు, చెట్లూ ఉన్నా వాటికి మంటలు వ్యాపించకపోవడం గమనార్హం.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి ఆశర్యానికి గురవుతున్నారు. ఈ మంటలు ఇలా ఎలా వెళుతున్నాయని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ వీడియో ఫేష్‌బుక్‌లో షేర్ చేయ్యగా.. ఇప్పటికే దీన్ని 40వేల మంది వరకు వీక్షించారు. ఫేస్‌బుక్‌లోనే గాక, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఈ వీడియో వైరల్ అవుతున్నాయి.

Netizens baffled by planned park fire that didnt burn through wooden benches or trees

కాగా, ఈ వీడియోను మొదట రెడ్డిట్‌లో ది రోసారీ ఐజిల్స్ అనే యూజర్ అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో పెద్ద చర్చకే దారితీసింది. గాలి వెనుక నుంచి వీస్తుంన్నదనే మంటలు అలా ముందుకు వెళ్లాయంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+