Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్ ట్రాఫక్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక సమస్య: యూకే గగనతలం మూసివేత, నిలిచిన విమానాలు

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(UK) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్య ఎదుర్కొంటోంది. కంప్యూటర్లలో సాంకేతిక సమస్యల వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విమానాశ్రయాలు, విమానాల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు బ్రిటన్‌లోని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతాయని తెలిపాయి.

 network failure: Airspace shut, planes grounded flying to and from UK

సంబంధిత ఇంజినీర్లు లోపాన్ని కనుగొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని, దీని వల్ల కలిగే అసౌకర్యానికి తాము క్షమాపణలు కోరుతున్నామని ఆయా సంస్థలు తెలిపాయి. అయితే, సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై స్పష్టత లేదు. సాంకేతిక సమస్య నెలకొన్న నేపథ్యంలో స్కాటిష్ విమానయాన సంస్థ లోగనైర్, ఈజీజెట్ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రయాణికులకు ట్విట్టర్ వేదికగా తెలిపాయి.

సోమవారం ఉదయం యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంప్యూటర్ సిస్టమ్ నెట్‌వర్క్ వైఫల్యం జరిగిందని తెలిపింది. ప్రస్తుతానికి యునైటెడ్ కింగ్డమ్ లో విమానాల రాకపోకల విషయంలో ల్యాండింగ్ కు మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ, టేకాఫ్‌కు అనుమతి లేదు. సుదీర్ఘ వారాంతపు సెలవులకు విదేశాలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో తిరిగి వస్తున్న సమయంలో విమాన సర్వీసులు ఆగిపోవడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ట్రావెల్ జర్నలస్ట్ సైమన్ కాల్డర్ పేర్కొన్నారు.

సమస్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి తాము సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఈజీజెట్ ఎయిర్‌లైన్ తెలిపింది. సాంకేతిక సమస్య వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్ వర్క్ వ్యవస్థ పని చేయడం లేదని బ్రిటన్ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
ఈ లోపాన్ని సరిచేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

అంతరాయంలో చిక్కుకున్న UK బ్రాడ్‌కాస్టర్ గాబీ లోగాన్ ట్వీట్ చేస్తూ.. " ఇంటికి దూరంగా దాదాపు 3 వారాల తర్వాత నేను నా కుటుంబాన్ని కౌగిలించుకోవడానికి గంటల తరబడి బుడాపెస్ట్ విమానాశ్రయంలో రన్‌వేపై విమానంలో ఉన్నాను. UK గగనతలం మూసివేయబడిందని ఇప్పుడే చెప్పారు. మేము ఇక్కడ 12 గంటలు ఉండవచ్చు. కాబట్టి మేము విమానంలో కూర్చుని వేచి ఉన్నాం' అని ఆవేదన వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+