సునామీ గురించి ఆ పుస్తకంలో ముందే రాసి వుంది..!!

Russia Earthquake 2025: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ హెచ్చరికలను జారీ చేశారు. రష్యా, జపాన్ దేశాలకు సునామీ ముప్పు పొంచివుంది. అమెరికా, ఇతర పసిఫిక్ దేశాలకూ సునామీ హెచ్చరికలు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా స్థానిక అధికారులు ఖాళీ చేయించారు. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి చేయాల్సిందంతా చేస్తోన్నారు.

New Baba Vanga Ryo Tatsuki Predicts Japan and Russia Tsunami

ఈ విపత్తుపై న్యూ బాబా వంగాగా పేరుగాంచిన రియో టాట్సుకి ముందే హెచ్చరించారు. జపాన్‌లో సంభవించే విపత్తు గురించి రియో టాట్సుకి రాసిన 'ది ఫ్యూచర్ ఐ సా' అనే పుస్తకంలో ప్రస్తావించారు. జపాన్ భాషలో ఈ పుస్తకాన్ని మంగా వతాషి గ మితా మరైగా పిలుస్తారు. 2025వ సంవత్సరం ద్వితీయార్థం తొలి నెలల్లోనే భారీ భూకంపం, సునామీ సంభవిస్తుందని రియో టాట్సుకి ఇందులో స్పష్టంగా పొందుపరిచారు.

ఈ బుక్ లో పొందుపరిచిన కొన్ని భయానకమైన అంచనాలు నిజం అయ్యాయి కూడా. దీంతో ఈ పుస్తకం మళ్ళీ తెరపైకి వచ్చింది. 1999లో ప్రచురితమైన ఈ మంగా గతంలో ఎన్నో విపత్తులను కచ్చితంగా ఊహించిందని చాలామంది నమ్ముతున్నారు. ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణాలు, కోవిడ్-19 వ్యాప్తి, 2011లో సంభవించిన భూకంపం, సునామీ వంటి నిజ జీవిత సంఘటనలను ఇందులో ఉన్నాయి.

ఈ సంవత్సరం జూలై 2025 గురించి కూడా ఈ బుక్ లో ఉంది. ది ఫ్యూచర్ ఐ సా.. బుక్ లో రాసిన విధంగా జూలై 5వ తేదీన ఏదో పెద్ద సంఘటన జరుగుతుందని ఊహాగానాలు చేశారు. ఆ తేదీ ముగిసిపోవడంతో చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.. దాని గురించి చర్చించనూ లేదు.

తాజాగా రష్యాలో 8.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించడం, జపాన్, అమెరికా సహా వివిధ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ కావడంతో మళ్లీ దీనిపై చర్చలు మొదలయ్యాయి. 2011లో వచ్చిన భూకంపం గురించి ముందుగా చెప్పిన జపనీస్ మంగా ప్రిడిక్టర్ రియో టాట్సుకి చెప్పినట్టే మళ్లీ విపత్తు వచ్చిందని, జపాన్ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటోన్నారు.

రియో టాట్సుకి జూలై 2025 గురించి చెప్పింది నిజమైంది.. అని ఓ యూజర్ మెన్షన్ చేశాడు. 1952 తర్వాత రష్యాలోని అదే ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపంగా పేర్కొంటున్నారు. 2011లో వచ్చిన సునామీ కారణంగా జపాన్ లో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+