H1B Visa లపై శుభవార్త

H1B Visa Exemptions: లక్ష డాలర్ల H1B వీసా ఫీజు పెంపునకు సంబంధించిన మార్గదర్శకాలు తాజాగా విడుదల అయ్యాయి. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీన్ని విడుదల చేసింది. ఇందులో భారీ మినహాయింపులను ప్రకటించింది. లక్ష డాలర్ల ఫీజును ఎక్కడే గానీ తగ్గించనప్పటికీ- పలు కేటగిరీలకు ఊరట కల్పించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాజా మార్గదర్శకాలను ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దరఖాస్తుకు అవసరమైన లేబర్ కండిషన్ అప్లికేషన్ లేదా టెంపరరీ లేబర్ సర్టిఫికేషన్ వంటి డాక్యుమెంట్లను పొందడంలో జాప్యం చోటు చేసుకోవచ్చని USCIS గుర్తించింది. ఫలితంగా ఫామ్ I-129 లేదా ఫామ్ I-129CW సమర్పించే వారికి ఇవి తప్పనిసరి. ఆ డాక్యుమెంట్లు సకాలంలో అందే అవకాశం లేదని స్పష్టం చేసింది. హెచ్1బీ వీసా పొందడానికి ఉద్దేశించిన ఇతర షరతులను అనుసరిస్తూ ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా వీసాను అప్‌డేట్ చేయలేకపోయినట్లు పిటిషనర్ నిరూపించగలిగితే, దానిని అసాధారణ పరిస్థితులుగా పరిగణిస్తామనరి తెలిపింది.

New H1B Visa Exemptions Discover Which Categories Avoid the 100000 dollar Fee

అడ్మినిస్ట్రేషన్ షట్ డౌన్ కారణంగా దరఖాస్తును సకాలంలో దాఖలు చేయడంలో విఫలమైన వారిని లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయించాలా? వద్దా అనేది నిర్ణయిస్తామని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం సైకిల్ లో సాధారణంగా జారీ చేసే H-1B వీసాల పరిమితి, అలాగే అమెరికన్ అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్లకు మినహాయింపు కింద లభించే మాస్టర్ క్యాప్ దరఖాస్తులు ఇప్పటికే అందాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి 65,000 సాధారణ, మాస్టర్ క్యాప్ కింద 20,000 హెచ్ 1బీ వీసాలను జారీ చేయాల్సి ఉంది.

లక్ష డాలర్ల ఫీజు స్టేటస్ ఆఫ్ ఛేంజ్ (Change of Status)కు వర్తించదని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. అంటే- ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండానే ఒక వర్గం నుండి మరొక వర్గానికి మారిన సందర్భాన్ని స్టేటస్ ఆఫ్ ఛేంజ్ గా పరిగణిస్తారు. ఉదాహరణకు.. F-1 విద్యార్థి H-1B స్టేటస్‌కు మారినప్పుడు లేదా అమెరికాలో నివాసం పొడిగింపును కోరుతున్నప్పుడు ఈ ఫీజు వర్తించదు. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో ప్రస్తుతం ఉంటోన్న భారత్ సహా విదేశీ విద్యార్థులు స్టేటస్ ఆఫ్ ఛేంజ్ కి వెళ్తే.. వాళ్లు లక్ష డాలర్ల ఫీజు చెల్లించనక్కర్లేదు.

అమెరికా వెలుపల నివసిస్తూ హెచ్ 1 బీ విసా కోసం దాఖలు అయ్యే దరఖాస్తుదారులు లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. అంటే భారత సహా ఇతర దేశస్తులు ఎవరైనా కొత్తగా దాఖలు చేసుకునే దరఖాస్తులు ఈ ఫీజు పరిధిలోకి వచ్చినట్టయింది. వాళ్లు హెచ్ 1బీ వీసా పొందాలంటే లక్ష డాలర్లను కట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుతం H-1B వీసా ఉన్నవాళ్లు అమెరికాను విడిచి వెళ్లి కొంతకాలం తర్వాత అంటే దాని గడువు ముగిసేలోగా తిరిగి రావాలనుకున్న వాళ్లు కూడా లక్ష డాలర్ల ఫీజు చెల్లించనక్కర్లేదని USCIS వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి 12:01 నిమిషాల తర్వాత దాఖలు చేసిన కొత్త H-1B దరఖాస్తుదారులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది.

F-1 హోదా ఉన్న గ్రాడ్యుయేట్లకు ఈ ఫీజు నుంచి భారీ మినహాయింపు లభించింది. భారత్ తో సహా ఇప్పటికే H-1B వీసా ఉన్న వివిధ దేశాల ఉద్యోగులకు సైతం ఉపశమనం కలిగింది. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించింది. అమెరికన్ కంపెనీలు భారత్ వంటి దేశాల నుండి ప్రొఫెషనల్స్ ను H-1B వీసా కింద మూడు సంవత్సరాల కాలపరిమితితో రప్పించుకోవడం ఆనవాయితీ. దీన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. అలాంటి వారిని కూడా ఇందులో నుంచి మినహాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+