ఆగంతకుని కాల్పులు: న్యూజెర్సీ మాల్ మూసివేత

New Jersey mall locked down after gunfire
న్యూజెర్సీ: నార్తర్న్ న్యూజెర్సీ‌లోనే పెద్దదైన ఓ మాల్ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి కాల్పులతో విరుచుకుపడ్డాడు. దీంతో పోలీసులు ఆ మాల్‌ను మూసివేసి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనలో షాపింగ్ మాల్‌లోని ఎవరికి గాయాలు కానప్పటికీ వేలాది మంది ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే..పారమస్‌లోని గార్డెన్ స్టేట్ ప్లాజాలోకి ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించి కాల్పులకు తెగపడ్డాడు. దీంతో షాపింగ్ మాల్‌లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. వీరితోపాటు స్వాట్(ఎస్‌డబ్ల్యూఏటి) బృందం కూడా ఘటన స్థలానికి చేరుకుంది. సోమవారం రాత్రి 11.30గంటల వరకు కూడా నిందితుడు పోలీసులకు చిక్కకపోవడంతో ఇంకా అతనికి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.

అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని బెర్జెన్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ అధికార ప్రతినిధి జెన్నీ బరట్టా తెలిపారు. మాల్ మూసివేసే సమయంలో (సుమారు రాత్రి 9.20గంటలకు) ఆగంతకుడు కాల్పులకు తెగపడ్డట్లు, పది నిమిషాల్లో పోలీసులు వచ్చి మాల్‌ను చుట్టిముట్టినట్లు టివిలో చూశానని ఆయన తెలిపారు.తుపాకీని కలిగి ఉన్న వ్యక్తి తన ఇష్టానుసారం కాల్పులు జరిపాడని, దీంతో అక్కడే ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు మాల్ అధికారులు తెలిపారు.

మాల్ వద్ద నాలుగురౌండ్ల కాల్పుల శబ్ధాన్ని విన్నట్లు మాల్ సమీపంలోని బ్రూక్ స్టోన్ స్టోర్స్ మేనేజర్ జోనాథన్ అస్టరికో తెలిపారు. ఆ తర్వాత పోలీసులు మాల్‌లోకి ప్రవేశించారని ఆయన చెప్పారు. మ్యాన్ హట్టన్ పట్టణానికి సుమారు 20 మైళ్ల దూరంలోని ఈ భారీ మాల్‌లో సుమారు 250 స్టోర్స్‌తోపాటు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. అందువల్ల కాల్పులు జరిపిన సమయంలోనూ అనేకమంది ప్రజలు అక్కడే ఉన్నారు. కాల్పుల ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మాల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+