‘వన్నాక్రై’ పోయిందనుకుంటే.. ‘ఇటర్నల్ రాక్స్’ వచ్చింది! ఇది మరీ డేంజర్ అట!!

'వన్నా క్రై' రాన్సమ్‌వేర్ కథ ముగిసిందో లేదో.. అంతలోనే మరో సరికొత్త మాల్‌వేర్ వచ్చింది. దీనిపేరు ‘ఇటర్నల్ రాక్స్’.ఇది దానికన్నా డేంజర్ అట!

న్యూయార్క్: నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన 'వన్నా క్రై' రాన్సమ్‌వేర్ కథ ముగిసిందో లేదో.. అంతలోనే మరో సరికొత్త మాల్‌వేర్ వచ్చింది. దీనిపేరు 'ఇటర్నల్ రాక్స్'. ఇది దానికంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

'ఇటర్నల్ రాక్స్' మాల్ వేర్ ను ఎదుర్కోవడం ఇంకా కష్టం అంటున్నారు సైబర్ నిపుణులు. ఇది ఇటర్నల్ బ్లూ అనే ఎన్‌ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుని ఒక కంప్యూటర్‌ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుందట. దాంతోపాటు ఇటర్నల్ చాంపియన్, ఇటర్నల్ రొమాన్స్, డబుల్ పల్సర్ అనే మరికొన్ని ఎన్ఎస్ఏ టూల్స్‌ను కూడా ఇది ఉపయోగించుకుంటుందని ఫార్చూన్ పత్రిక తెలిపింది.

ప్రస్తుతానికి 'ఇటర్నల్ రాక్స్'లో ఎలాంటి ప్రమాదకరమైన అంశాలు లేవని, అది ఫైళ్లను లాక్ చేయడం లేదా కరప్ట్ చేయడం లాంటివి జరగడం లేదని అంటున్నారు. అయితే, ఇటర్నల్ బ్లూ మాత్రం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్‌ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేస్తుందట.

 New, scarier ransomware EternalRocks found: Researchers

గడిచిన పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు రకాల సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంతో సహా దాదాపు 150 దేశాల మీద దాడి చేసిన 'వన్నాక్రై' రాన్సమ్‌వేర్ దాదాపు 2.40 లక్షల కంప్యూటర్లకు వ్యాపించింది. ఇది ప్రధానంగా విండోస్ 7 అప్‌డేటెడ్ వెర్షన్లున్న కంప్యూటర్లకే అంటుకుంది. ఒకసారి ఈ రాన్సమ్‌వేర్ కంప్యూటర్‌లోకి ప్రవేశించిందంటే మొత్తం ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి వాళ్లు చెప్పిన మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు దానికంటే ఇటర్నల్ రాక్స్ అనేది మరింత బలమైనదని చెబుతున్నారు. 'వన్నాక్రై'ని అడ్డుకోడానికి ఒక కిల్ స్విచ్ ఉంది గానీ, దీనికి అది కూడా లేదు. ఇప్పటివరకు ఇది ఎంతవరకు వ్యాపించిందో ఇంకా తెలియదు గానీ, ఎన్ఎస్ఏ ఆధారిత మాల్‌వేర్‌లో ఇది కొత్త రకం అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+