16సార్లు న్యూఇయర్ వేడుకలు: గిన్నిస్ రికార్డు తిరగరాసిన బుర్జ్ ఖలీఫా
దుబాయ్: నూతన సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్‌ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి.
కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో వెలుగుజిలుగులతో ప్రపంచంలోని కొత్త సంవత్సర శోభ మొత్తం దుబాయ్‌లోనే కనిపించినట్లయింది.
వేల మంది స్థానికులు, పర్యాటకులు ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది టీవీల్లో ఈ అద్భుతాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఈ వేడుకలను నిర్వహించడానికి ప్రపంచంలోని 200 మంది నిపుణులు సుమారు లక్షా 92 వేల గంటల పాటు శ్రమించారట.

అంతరిక్ష కేంద్రంలో 16సార్లు కొత్త సంవత్సర వేడుకలు
వాషింగ్టన్: నూతన సంవత్సర వేడుకలు ప్రపంచంలో ఎవరికైనా ఒకేసారి వస్తాయి. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములు మాత్రం ఏకంగా 16సార్లు వేడుకలు జరుపుకొన్నారు. భూమి చుట్టూ గంటకు 28163 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఐఎస్‌ఎస్.. 16 సందర్భాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయాన్ని చవిచూసిందని నాసా ప్రకటించింది.
ఐఎస్‌ఎస్‌లో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ద ఎక్స్‌పెడిషన్ 42లోని ఐదుగురు వ్యోమగాములు.. తమ రోజువారీ పరిశోధనల్లో నిమగ్నమవుతూనే 16సార్లు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications