స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి బాంబు బెదిరింపు: సురక్షిత ప్రాంతానికి ప్రజలు
న్యూయార్క్: ప్రతిరోజూ కూడా వేలాదిమంది పర్యాటకులతో రద్దీగా ఉండే న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రాంతంలో బాంబు పెట్టారన్న సమాచారంతో న్యూయార్క్ సిటీ పోలీసులు అధికారులు శనివారం సందర్శకుల పర్యటనను నిలిపివేశారు.

బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రాంతంలో 2,700 మంది పర్యాటకులు ఉన్నారని, వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు.
మళ్లీ తిరిగి ఉదయం 8.30 గంటల నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రాంతానికి సందర్శకులను అనుమతించినట్లు పేర్కొన్నారు.
Evacuated from liberty isl due to "situation" and concern for safety. How often does that happen? #nyc #crowdedferry pic.twitter.com/vAzXaNzqOm
— Daniel Dittenhafer (@dwdii) April 24, 2015 Waiting to be evacuated off #libertyisland. Interesting. pic.twitter.com/C0WAdbZRyB
— Rick Borgmeyer (@flyingtigers) April 24, 2015 Waiting to be evacuated off #libertyisland. Interesting. pic.twitter.com/C0WAdbZRyB
— Rick Borgmeyer (@flyingtigers) April 24, 2015 











Click it and Unblock the Notifications