Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త ఏడాది సంబరాల్లో న్యూజిలండ్, ఆస్ట్రేలియా: ఎదురుచూస్తున్న భారత్ సహా ఈ దేశాలు

అక్లాండ్: మనదేశంలో మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుపెట్టనుండగా.. ప్రపంచంలోని పలు దేశాలు మాత్రం ఇప్పటికే న్యూఇయర్ సెలబ్రేషన్ ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే మొదటిగా న్యూజిలాండ్ దేశం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నగర ప్రజలు స్కైటవర్ వద్దకు చేరుకుని కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

బాణసంచా వెలుగుల మధ్య కివీస్ ప్రజలు 2023కి గుడ్‌బై చెప్పి.. 2024కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్ షో, ఫైర్‌వర్క్స్ షోలు ఆకట్టుకున్నాయి. మరోవైపు, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని సిడ్నీ హార్బర్ వద్ద కొత్త మేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షోలు జిగేల్ అనిపించాయి. మరోవైపు, భారత్ తోపాటు మిగి తా దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుపెట్టేందుకు ఆత్రూతగా ఎదురుచూస్తున్నాయి.

New Zealand, Australia welcome 2024 with fireworks, celebration

కాగా, ఆస్ట్రేలియాలో మనకంటే ఐదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతోంది. సూర్యోదయ భూమిగి పేర్కొంటున్న జపాన్ కూడా మనకంటే మూడున్నర గంటలముందే 2024లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు మనకంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

మరోవైపు, సుమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2024లోకి అడుగుపెతాం. అదే సమయంలో భారత్ తోపాటు శ్రీలంక కూడా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఇక మనదేశం తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి. జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా.. కాంగో, అంగోలా, కామెరూన్ వంటి ఆఫ్రికా దేశాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.

భారత్ తర్వాత ఐదున్నర గంటలకు ఇంగ్లాండ్‌‌లో కొత్త ఏడాది సంబరాలు మొదలవుతాయి. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్త ఏడాదకి స్వాగతం పలుకుతుంది. అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవుల్లో చివరగా కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ జనవాసాలు లేకపోవడంతో అమెరికన్ సుమోవాను చివరిదిగా పరిగణిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+