New Zealand MP: పార్లమెంట్‌లో న్యూజిలాండ్ MP హాకా డ్యాన్స్.. ఈసారి సహచరులతో కలిసి నిరసన

Dance in Parliament: వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించి, ఎంతో అనుభవం కలిగిన వారు గతంలో రాజకీయాల్లోకి వచ్చేవారు. యవతకు రాజకీయాలు సరికాదనే ఆలోచనా ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. యువరక్తం పాలిటిక్స్‌లోకి వచ్చి ఏకంగా ఆయా దేశాల స్థితిగతులనే మార్చేస్తుంది. న్యూజిలాండ్‌లోనూ ఇదే తరహాలో రాజకీయ ఓనమాలు దిద్దిన ఓ యువతి ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్‌లో హనా -రౌహితీ మైపీ-క్లార్క్ అనే 22 ఏళ్ల యవతి అత్యంత పిన్న వయస్కురాలైన MPగా గతంలో చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ దేశ పార్లమెంట్‌లో ఆమె చేసిన 'హాకా వార్ క్రై' నృత్యం నెట్టింట వైరల్‌గా మారింది. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి ప్రసంగం సమయంలోనే డ్యాన్స్ చేయడం మావోరీ సంస్కృతికి నివాళిగా పేర్కొన్నారు.

New Zealand youngest MP Haka dance went viral again

కాగా ఇప్పుడు మరోసారి ఆమె పాదాలను గట్టిగా తొక్కడం, పిడికిలి బిగించడం మరియు కోపంగా ఉన్న ముఖ కవళికలతో సాంప్రదాయ హాకా నృత్య కదలికలను ప్రదర్శించారు. ఈసారి మరింత శక్తివంతంగా డ్యాన్స్ చేశారు. 1840 నాటి వైతాంగి ఒప్పందంతో ముడిపడి ఉన్న బిల్లుకు వ్యతిరేకంగా ఆమె ఈ నిరసన ప్రదర్శన చేపట్టగా ఇతర రాజకీయ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. తె పాటి మావోరీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హనా మరియు ఆమె పార్టీ సభ్యుల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు న్యూజిలాండ్ పార్లమెంట్ నుంచి ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో విజువల్స్‌ను షేర్ చేసుకుంటున్నారు.

బ్రిటీష్ క్రౌన్ మరియు మావోరీ ప్రజల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందంలో మార్పులు చేయాలని హనా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సీటు నుంచి లేచి నిలబడి తన చేతిలోని బిల్లు పత్రాలను చించివేశారు. అనంతరం పార్లమెంటులో హాకా డ్యాన్స్ చేయడానికి నేలపై కూర్చున్నారు. దీంతో ఈ వివాదాస్పద బిల్లుకు ఓటింగ్ వేళ పార్లమెంటు సమావేశాలు కొద్దిసేపు నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+