భగవద్గీతపై ఒట్టు: ఐ లవ్ హిమ్..అంటూ ట్రంప్ ట్వీట్

Kash Patel: అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

తాజాగా ఆయన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. రాజధాని వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌ ఐషెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌ ఇండియన్ ట్రీటీ రూమ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బొండి.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భగవద్గీత సాక్షిగా కాష్ పటేల్ ప్రమాణం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Newly appointed FBI director Kash Patel takes oath on the Bhagavad Gita

బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అమెరికన్లు కలగన్నట్టుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతానని, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పిస్తానని అన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప దేశం.. అందులో ఎఫ్‌బీఐ వంటి సంస్థకు నాయకత్వాన్ని వహించబోతోండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.

కాష్ పటేల్‌ను అభినందించారు డొనాల్డ్ ట్రంప్. ఎఫ్‌బీఐపై ఆయనకు ఉన్న మమకారాన్ని ప్రస్తావించారు. ఏజెంట్లు అంటే ఎంతో గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. ఐ లవ్ కాష్ పటేల్.. అంటూ కామెంట్ చేశారు. ఎఫ్‌బీఐ అంటే అంకితభావం ఉందని, అందుకే ఆయనను డైరెక్టర్‌గా నియమించానని అన్నారు.

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును గతంలోనే ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి పదవులకు సంబంధించిన నియామకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

కాష్ పటేల్.. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. ప్రవాస భారతీయుడు. స్వరాష్ట్రం గుజరాత్. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తండ్రి అమెరికాలోని ఓ ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌. లాంగ్ ఐలండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు కాష్ పటేల్.

2002లో యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ చదివారు. అనంతరం యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. డొనాల్డ్ ట్రంప్ లాయలిస్ట్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. ట్రంప్ తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+