కోవిడ్ కారణంగా ప్రధాని పెళ్లి రద్దు

న్యూజీలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆడెర్నా తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో కొత్తగా ప్రకటించిన కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆమె తన పెళ్లి నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూజీలాండ్‌లో ఆంక్షలు తీవ్రతరం చేస్తున్నారు.
ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు, దుకాణాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం.... ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే అతిథుల సంఖ్య 100 మందికి మించరాదని, పైగా వారంతా పూర్తిగా వ్యాక్సీన్ వేసుకున్నవారు అయి ఉండాలని నిబంధనలు విధించారు.
న్యూజీలాండ్‌లో ఇప్పటివరకు 15,104 కోవిడ్ కేసులు నమోదు కాగా 52 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఆర్డెన్ తన వివాహం గురించి ఆదివారం ప్రకటన చేశారు. టీవీ వ్యాఖ్యాత క్లార్క్ గేఫోర్డ్‌తో జరగబోయే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.
''మహమ్మారి కారణంగా వేలాది మంది న్యూజీలాండ్ ప్రజలు కష్టాలు పడుతున్నారు. వారి కంటే నేనేమీ ప్రత్యేకమేమీ కాదు. మనం బాగా ప్రేమించేవారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా వారితో ఉండలేకపోతున్నాం'' అన్నారామె.
- రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?

న్యూజీలాండ్‌లో కొత్తగా విధించిన ఆంక్షలు అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశంలో 9 ఒమిక్రాన్ కేసులు బయటపడిన తరువాత ఆంక్షలు కఠినతరం చేశారు.
ఆక్లాండ్‌లో ఒక వివాహానికి హాజరైన తరువాత ఓ కుటుంబం మొత్తానికి కోవిడ్ నిర్ధరణైంది. మరో ఫ్లైట్ అటెండెంట్‌కూ వైరస్ సోకింది.
కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ తీవ్రమవుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు.
ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే గరిష్ఠంగా 100 మంది వ్యాక్సీన్ వేయించుకున్నవారు మాత్రమే హాజరు కావడానికి అనుమతి ఉంది ఇప్పుడు. వ్యాక్సీన్ పాస్‌లు వినియోగించకపోతే 25 మందికి మించి హాజరుకావడానికి వీల్లేదు.
జిమ్‌లు, వివాహాలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. స్కూల్ విద్యార్థులు కూడా మాస్కులు ధరించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్: అమెరికా హడావుడి దౌత్య ప్రయత్నాలు, ఊహకు అందని రష్యా వ్యూహాలు
- 'చిరు వచ్చింది భోజనానికే’: మంత్రి పేర్ని నాని
- మియన్మార్ సైనిక ప్రభుత్వాన్ని ధిక్కరిస్తోన్న నర్సులు, వైద్యులు... రహస్యంగా ప్రజలకు వైద్య సేవలు
- ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?
- 'పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications