ఆ బూట్ల రేటు రూ. 3 కోట్లు.. ఆన్‌లైన్ వేలంలో రికార్డు బ్రేక్..
సాధారణంగా బూట్ల ధర ఎంత ఉంటుంది? వందలు, వేలు.. సెలబ్రటీలైతే లక్షలు పెట్టి కొంటారు. అయితే అమెరికన్ కంపెనీ నైక్ తయారు చేసిన బూట్ల ధర వింటే మీకు దిమ్మ దిరగడం ఖాయం. అదీ కొత్త షూ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎప్పుడో 45 ఏళ్ల క్రితం నాటి షూను ఓ వ్యక్తి కోట్లు పెట్టి కొన్నాడు. ఇంతకీ ఆ షూ ఎవరు కొన్నారు? వాటిస్పెషాలిటీ ఏంటి? అంత డబ్బు పెట్టి ఎందుకు కొన్నాడు?

రికార్డు ధర పలికిన స్నీకర్స్
అమెరికాకు చెందిన షూ మేకర్ నైక్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సంస్థ దాదాపు 5దశాబ్దాల క్రితం తయారు చేసిన బూట్లను వేలం వేస్తే రికార్డు ధర పలికింది. 1972లో మూన్ షూ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చిన ఈ స్నీకర్స్‌ను సోథిబై సంస్థ వేలం వేయగా ఏకంగా 4,37,500 డాలర్లు పలికింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.3కోట్ల పైమాటేనన్న మాట.

1972లో తయారైన షూస్
కెనడాకు చెందిన మైల్స్ వాదల్ అనే వ్యక్తి సోథిబై ఆన్‌లైన్ యాక్షన్‌లో ఈ షూస్‌ను దక్కించుకున్నారు. గతవారంలోనే ఆయన అత్యంత అరుదైన 99 జతల షూస్‌ను కొనుగోలు చేశారు. వాటి కోసం ఆయన 8,50,000 డాలర్లు ఖర్చు చేశారు. వేలంతో దక్కించుకున్న నైక్ మూన్ షూస్‌తో కలిసి ఆయన ప్రైవేట్ మ్యూజియంలో వాటిని ప్రదర్శనకు ఉంచనున్నారు.

వేలంలో ప్రపంచ రికార్డు
తాజాగా సోథిబైలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడుపోయిన షూస్‌ను 1972లో తయారు చేశారు. ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనే రన్నర్ల కోసం నైక్ కో ఫౌండర్ బిల్ బోవర్‌మన్ మూన్ షూను డిజైన్ చేశారు. అప్పట్లో కేవలం 12 జతలు మాత్రమే తయారు చేసిన ఈ షూస్‌లో ఒక దాన్ని సోథిబై వేలం వేసింది.
వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన నైక్ షూస్ సరికొత్త ప్రపంచరికార్డు నమోదుచేశాయి. 1984 ఒలింపిక్స్ బాస్కెట్ బాల్ ఫైనల్స్ సమయంలో బాస్కెట్ బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ వేసుకున్న కాన్‌వర్స్ స్నీకర్స్‌ను 2017లో వేలం వేశారు. అప్పట్లో సోథిబై నిర్వహించిన ఈ యాక్షన్‌లో ఆ షూస్ 1,90,373 డాలర్లకు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఇదే ప్రపంచరికార్డ్ కాగా.. నైక్ మూన్ షూస్ ఆ రికార్డు బ్రేక్ చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications