జెలెన్‌స్కీని చంపడం కంటే మరో మార్గం లేదు: సంచలన ప్రకటన

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి ఎక్కడా బ్రేకులు పడట్లేదు. 15 నెలలుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసం మాస్కోలోని క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది. అధ్యక్ష భవనంపై తిరుగాడిన రెండు డ్రోన్లను రష్యా కూల్చివేసింది. దీన్ని ఉక్రెయిన్ చర్యగా ప్రకటించింది రష్యా. వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చడానికే ఈ డ్రోన్లను సంధించిందటూ ఆరోపించింది. ఈ దాడికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ప్రకటించింది.

Zelenskyy

అధ్యక్ష భవనంపై డ్రోన్లు తిరుగాడిన సమయంలో వ్లాదిమిర్ పుతిన్ అక్కడ లేరని క్రెమ్లిన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడి, ప్రతిదాడిలో భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని పేర్కొంది. ఈ నెల 9వ తేదీన రెడ్ స్క్వేర్‌లో విక్టరీ పరేడ్‌ను నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తోన్న ఈ పరిస్థితుల్లో క్రెమ్లిన్‌పై డ్రోన్లు సంచరించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విక్టరీ పరేడ్ యధాతథంగా కొనసాగుతుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి తెలిపారు.

రష్యా చేసిన ఆరోపణలపై ఉక్రెయిన్ వెంటనే స్పందించింది. డ్రోన్ల దాడితో తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చింది. ఈ దాడి వల్ల తమ తమ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతమౌతుందని తాము భావించట్లేదని స్పష్టం చేసింది. అలాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా తమ వద్ద లేవంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు.

ఈ దాడి తరువాత రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదెవ్ సంచలన ప్రకటన చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ పన్నిన కుట్రగా అభివర్ణించారు. డ్రోన్లతో ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించిందంటూ ఆరోపించారు. ఉక్రెయిన్ గీత దాటిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదంటూ ఆయన హెచ్చరించారు.

Zelenskyy

వొలొదిమిర్ జెలెన్‌స్కీని హతమార్చడం కంటే మరో ప్రత్యామ్నాయం కనిపించట్లేదని మెద్వెదెవ్ తేల్చి చెప్పారు. జెలెన్‌స్కీ తమకు లొంగిపోవాల్సిన అవసరం కూడా లేదని, అలాంటి డాక్యుమెంట్లు లేదా ప్రతిపాదనలపై ఆయన సంతకం చేయాల్సిన పని కూడా లేదని మెద్వెదెవ్ అన్నారు. జెలెన్‌స్కీని ఆయన హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్ కూడా ఇలాంటి ప్రతిపాదనలపై సంతకం చేయలేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+